అనుమానంతో రెండో భార్య హత్య.. పోలీసుల ముందు లొంగిపోయిన ఆటో డ్రైవర్

Published : Aug 17, 2023, 05:05 AM IST
అనుమానంతో రెండో భార్య హత్య.. పోలీసుల ముందు లొంగిపోయిన ఆటో డ్రైవర్

సారాంశం

Tirupati district: భార్య క్యారెక్ట‌ర్ పై అనుమానం పెంచుకున్న ఓ భ‌ర్త‌.. ఆమెపై సిమెంట్ ఇటుక‌తో దాడి చేసి హ‌త్య చేశాడు. అనంత‌రం పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ షాకింగ్ ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని తిరుప‌తి జిల్లాల్లో చోటుచేసుకుంది.   

Auto driver kills second wife: భార్య క్యారెక్ట‌ర్ అనుమానం పెంచుకున్న ఓ భ‌ర్త‌.. ఆమెపై సిమెంట్ ఇటుక‌తో దాడి చేసి హ‌త్య చేశాడు. అనంత‌రం పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ షాకింగ్ ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని తిరుప‌తి జిల్లాల్లో చోటుచేసుకుంది. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు విచార‌ణ ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. రెండో భార్య తీరుపై అనుమానం పెంచుకున్న ఓ నడివయస్కుడైన‌ ఆటోడ్రైవర్‌ ఆమెను సిమెంట్‌ ఇటుకతో కొట్టి ప్రాణాలు తీశాడు. ఆమె ను హ‌త్య చేసిన త‌ర్వాత నేరుగా వెళ్లి స్థానిక పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘ‌ట‌న‌ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా నాగలాపురంలో బుధవారం చోటుచేసుకుంది. నిందితుడిని వెంకటేష్‌గా , బాధితురాలిని గాయత్రిగా గుర్తించారు.

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగలాపురం మండలం బ్రాహ్మణ తంగల్ పంచాయతీ వద్ద వడ్డి ఇండ్లి నివాసి వెంకటేష్‌కు ఇద్దరు మహిళలతో వివాహమైంది. అతను గాయత్రి విశ్వసనీయతపై అనుమానం పెంచుకున్నాడు. అనుమానం కాస్త పెనుభూతంగా మారింది. ఈ నేప‌థ్యంలోనే ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం హ‌త్య కుట్ర‌కు ప్రాణాళిక‌లు సిద్ధం చేసుకున్నాడు.

అనుకున్నంటుగానే మంగళవారం అర్ధరాత్రి వెంకటేష్ తన ఇద్దరు పిల్లలను మరో గదిలో ఉంచి, గాయత్రిపై సిమెంట్ ఇటుకతో దాడి చేసి ఆమె ప్రాణాలు తీశాడు. ఈ హ‌త్య త‌ర్వాత నిందితుడు నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న నాగలాపురం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దీనిపై ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ద‌ని తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu