వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పీఏపై దాడి.. కుప్పంలో ఉద్రిక్తత.. సొంత పార్టీ నేతల పనేనా..?

Published : Sep 01, 2022, 12:49 PM IST
వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పీఏపై దాడి.. కుప్పంలో ఉద్రిక్తత.. సొంత పార్టీ నేతల పనేనా..?

సారాంశం

చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పీఏ మురుగేష్‌పై దాడి కలకలం రేపింది.అయితే ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పీఏ మురుగేష్‌పై దాడి కలకలం రేపింది. కుప్పం బైపాస్ రోడ్డులో వైసీపీ నేతకు చెందిన ఎంఆర్ హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సొంత పార్టీ నేతలే ఈ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మురుగేష్‌కు ఆస్పత్రిలో  చికిత్స కొనసాగుతుంది. అతని తలకు 14 కుట్లు పడినట్టుగా సమాచారం. కుప్పం వైసీపీలో కొంతకాలంగా వర్గవిభేదాలు ఉన్నాయని.. మురుగేష్‌పై దాడికి అవే కారణమని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. సొంత పార్టీ నేతలే ఇలా చేయడంపై ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు. 

ఇక, ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరోవైపు మురుగేష్‌పై దాడికి సంబంధించి ఎమ్మెల్సీ భరత్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

పవన్ కళ్యాణ్‌తో భేటీ కానున్న త‌మిళ‌నాడు సీఎం విజ‌య్‌.. ఏం చ‌ర్చించ‌నున్నారంటే.?
ఇది బాబుగారి మాటగా చెబుతున్న | Atchennaidu On Local Body Elections | Asianet News Telugu