ఎవరైనా ఆధారాలు చూపి చంపుతారా?: లోకేష్ పై డీజీపీకి పోసాని ఫిర్యాదు

By narsimha lode  |  First Published Aug 23, 2023, 1:24 PM IST

టీడీపీ నేత లోకేష్ తో తనకు  ప్రమాదం ఉందని  ఏపీ డీజీపీకి  ఏపీ‌ఎఫ్‌డీసీ చైర్మెన్ పోసాని కృష్ణ మురళి  ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు.


అమరావతి:టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ పై  ఏపీ డీజీపీ  రాజేంద్రనాథ్ రెడ్డికి  ఏపీఎఫ్‌డీసీ చైర్మెన్  పోసాని  కృష్ణ మురళి  ఫిర్యాదు చేశారు. లోకేష్ తనను హత్య చేసేందుకు  కుట్ర చేశారని  ఆయన బుధవారంనాడు  డీజీపీకి ఫిర్యాదు చేశారు.  డీజీపీకి ఫిర్యాదు చేసిన తర్వాత  పోసాని  కృష్ణ మురళి మంగళగిరిలో  మీడియాతో మాట్లాడారు. 

తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని  పోసాని కృష్ణ మురళి  చెప్పారు. అయితే  తనకు  భద్రత కల్పిస్తానని  డీజీపీ హామీ ఇచ్చారన్నారు.  డీజీపీ దృష్టికి అన్ని విషయాలను తీసుకెళ్లినట్టుగా  పోసాని కృష్ణ మురళి  తెలిపారు..  

Latest Videos

undefined

లోకేష్ కారణంగా తనకు  ఉన్న ప్రమాదం గురించి  డీజీపీకి వివరించానన్నారు.  టీడీపీలో చేరాలని  లోకేష్ తనను కోరాడన్నారు. అయితే తాను  టీడీపీలో చేరేందుకు  అంగీకరించలేదన్నారు. అందుకే  లోకేష్  ఇగో హర్ట్ అయిందని  పోసాని  కృష్ణ మురళి  చెప్పారు.ఎవరైనా ఆధారాలు చూపి హత్యలు చేస్తారా అని  మీడియా ప్రతినిధులను  పోసాని కృష్ణ మురళి ప్రశ్నించారు.

also read:కోర్ట్ దగ్గర నా హత్యకు కుట్ర.. లోకేష్‌దే బాధ్యత : పోసాని సంచలన వ్యాఖ్యలు

ఈ నెల  22న  మీడియా సమావేశం ఏర్పాటు చేసి లోకేష్ పై  పోసాని కృష్ణ మురళి  ఇవే ఆరోపణలు చేశారు. కేంతేరులో లోకేష్  14 ఎకరాల భూమి  కొన్నారని తాను చేసిన ఆరోపణలపై  తనపై లోకేష్ రూ. 4 కోట్లకు పరువు నష్టం దావా వేశారన్నారు. చంద్రబాబు, లోకేష్ అకృత్యాలను బయట పెట్టినందుకు  తనపై  పరువు నష్టం దావా వేశారని  పోసాని కృష్ణ మురళి  చెప్పారు. కోర్టుల చుట్టూ తిరిగేలా తనను చేయాలని  చూస్తున్నారన్నారు. కోర్టు వాయిదాలకు తాను హాజరయ్యే సమయంలో  తనను హత్య చేసేందుకు  కుట్ర చేశారని   పోసాని కృష్ణ మురళి  ఆరోపణలు చేశారు.

మరో వైపు తనకు  పెదకాకానిలో  16 ఎకరాల భూమి ఉందని  వచ్చిన ఆరోపణలపై కూడ  పోసాని కృష్ణ మురళి స్పష్టత ఇచ్చారు.తనకు  పెదకాకానిలో  భూములున్నట్టు నిరూపిస్తే  వారికే  రాసివ్వనున్నట్టుగా  తేల్చి చెప్పారు. 

నిన్న  లోకేష్ పై చేసిన  ఆరోపణలకు కొనసాగింపుగా  ఇవాళ ఏపీ  డీజీపీ  రాజేంద్రనాథ్ రెడ్డితో  పోసాని కృష్ణ మురళి సమావేశమయ్యారు.  లోకేష్ పై ఫిర్యాదు  చేశారు. రక్షణ కల్పించాలని కోరారు

click me!