పితానిని తాకిన ఈఎస్ఐ స్కాం :టీడీపీ, వైసీపీ వాదనలు ఇవీ

By narsimha lodeFirst Published Feb 21, 2020, 5:50 PM IST
Highlights

 ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు మరో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పాత్ర కూడ ఉందని ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి.

అమరావతి: ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు మరో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పాత్ర కూడ ఉందని ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు తమ వద్ద ఆధారాలు ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈఎస్ఐ స్కాంలో  తన ప్రమేయం లేదని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తాజాగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పేరును కూడ ప్రభుత్వవర్గాలు తెరమీదికి తెస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగానే ఏపీ రాష్ట్రంలో కూడ ఈఎస్ఐలో కుంభకోణం చోటు చేసుకొన్నట్టుగా విజిలెన్స్ ఎన్‌పోర్స్‌మెంట్ నివేదిక బయటపెట్టింది. టెలీ హెల్త్ సర్వీసెస్ అనే సంస్థకు  నామినేషన్ పద్దతిలో   కాంట్రాక్టులు కట్టెబట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు లేఖ రాసినట్టుగా ఈ నివేదిక తేల్చింది.

ఏపీ రాష్ట్రంలో ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తర్వాత కార్మిక శాఖ బాధ్యతలు స్వీకరించిన పితాని సత్యనారాయణ కూడ ఈ వ్యవహరంలో భాగస్వామిగా ఉన్నాడని ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు తమ వద్ద సమాచారం ఉందని  ప్రభుత్వం చెబుతోంది.

ఏపీ రాష్ట్రంలో  కార్మిక శాఖలో బడ్జెట్ కు మంచి  ఖర్చును  పెడుతున్నారని  కార్మిక శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ మేరకు  2017 నవంబర్ 28వ తేదీన కార్మిక శాఖ ఉన్నతాధికారులు మెమోను జారీ చేశారు. రెండో క్వార్టర్‌ను కేటాయించిన దాని కంటే అదనంగా రూ. 34.05 కోట్లను ఖర్చు చేసినట్టుగా అధికారులు గుర్తించారు.

అయితే ఈ మోమోను అభయన్స్‌లో పెట్టాలని  2018 ఫిబ్రవరి మాసంలో  అప్పటి మంత్రి పితాని సత్యానారాయణ  ఆదేశాలు జారీ చేశారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ మెమోను పితాని సత్యనారాయణ ఎందుకు అభయన్స్‌లో పెట్టాలని ఉత్తర్వులు జారీ చేశారనే విషయమై విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. 

అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణల వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉండి ఉండొచ్చిన కొందరు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే అచ్చెన్నాయుడుపై తప్పుడు కేసులు పెట్టేందుకు వైసీపీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది.

 


 

click me!