
AP 10th Class Results 2022: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు శుభవార్త చేసింది. ఈ నెల 4న పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. శనివారం ఉదయం 11 గంటలకు విజయవాడలో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ఫలితాలను విడుదల చేస్తారని అధికారులు పేర్కొన్నారు. ఈసారి గ్రేడ్‌లకు బదులు మార్కుల రూపంలో ఫలితాలు ప్రకటించనున్నట్లు తెలిపింది.
ఏప్రిల్ 27న ప్రారంభమైన టెన్త్ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి. కాగా.. ఈ సారి రికార్డు స్థాయిలో కేవలం 25 రోజుల్లోనే పదో తరగతి ఫలితాలు ప్రకటించనుంది రాష్ట్ర విద్యాశాఖ. విద్యార్థుల తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ -bse.ap.gov.in, manabadi.comలో తనిఖీ చేసుకోగలరని విద్యాశాఖ తెలిపింది. అధికారిక నివేదికల ప్రకారం.. ఈ ఏడాది దాదాపు 6.5 లక్షల మంది విద్యార్థులు AP 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. దీనికి ముందు.. AP 10వ తరగతి ఫలితాలను 2022 జూన్ 10 నాటికి ప్రకటించబడే అవకాశం ఉందని సూచించాయి. కానీ, ఆశ్చర్యం గురయ్యేలా .. AP SSC ఫలతాలను రేపే ప్రకటిస్తుంది.
కాగా.. మరోవైపు ఫలితాల తరువాత విద్యాసంస్థలు ర్యాంకులకు ప్రకటనల రూపంలో ఇవ్వడంపై కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే.. జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించింది. మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది రాష్ట్ర విద్యాశాఖ.