నీ సంగతేమిటో చూస్తామని అంటున్నారు: నిమ్మగడ్డ రమేష్ తీవ్ర వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Feb 1, 2021, 5:41 PM IST
Highlights

తాను ఎవరినీ కించపర్చలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు.


శ్రీకాకుళం: తాను ఎవరినీ కించపర్చలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. తన 40 ఏళ్ల అనుభవంలో ఏ విధమైన వివాదాల జోలికి వెళ్లలేదని ఆయన చెప్పారు. ఈసీ పలు సవాళ్లను ఎదుర్కుంటోందని అన్నారు. కొన్ని వ్యవస్తలు నీ సంగతేమిటో చూస్తామని అంటున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. 

సోమవారం నాడు ఆయన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో  ఆయన మీడియాతో మాట్లాడారు. సామాన్యంగా జరిగే ఏకగ్రీవాలను తాను వ్యతిరేకించబోనని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తేల్చి చెప్పారు.

ఎప్పుడూ స్వీయ నియంత్రణనే పాటించినట్టుగా ఆయన ఈ సందర్భంగా చెప్పారు.ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ చొరబడకూదని ఆయన చెప్పారు.ఎవరైనా అతిక్రమిస్తే వారికి కూడ అదే అనుభవం ఎదురౌతోందన్నారు.

ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరగాలని రాజ్యాంగం చెప్పిందని చెప్పారు. రాజ్యాంగం ఏం చెప్పిందో అదే  దాన్నే తాను  పాటిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఎన్నికల సంఘంపై కేసు నమోదు చేశారని ఆయన చెప్పారు.

ఎన్నికల సంఘం అధికారులపై కూడా కేసులు పెట్టిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇది అవాంఛనీయమని చెప్పారు. దేశంలో ఎక్కడా కూడ ఇలాంటి ఘటనలు జరగలేదని ఆయన చెప్పారు. ఇలాంటి ఘటనలను చూస్తూ ఊరుకొంటే సంస్థ పలుచబడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే కోర్టుకు వెళ్లినట్టుగా ఆయన గుర్తు చేశారు.

also read:ప్రైవేట్ వాహనాల్లో తిరిగినా...: ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్‌కి నిమ్మగడ్డ లేఖ

న్యాయ వ్యవస్థపై తనకు సంపూర్ణమైన విశ్వాసం ఉందని చెప్పారు.ప్రతి వ్యవస్థకూ రాజ్యాంగం నిర్ధిష్టమైన బాధ్యతలు అప్పగించిందన్నారు.ఎన్నికల సంఘానికి రాజ్యాంగం ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన విషయాన్ని ప్రస్తావించారు.నిఘా వ్యవస్థ ఎంత ముఖ్యమో మంచి మీడియా కూడ అంతే ముఖ్యమని ఆయన చెప్పారు. 

click me!