పరిషత్ ఎన్నికల రద్దు: సింగిల్ బెంచ్ తీర్పుపై... డివిజన్ బెంచ్‌లో ఏపీ ఎస్ఈసీ పిటిషన్

By Siva Kodati  |  First Published Jun 23, 2021, 8:09 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికల రద్దును సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ఎస్ఈసీ నీలం సాహ్ని పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల్ని రద్దు చేస్తూ హైకోర్ట్ సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో ఎస్ఈసీ పిటిషన్ దాఖలు చేశారు. 


ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికల రద్దును సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ఎస్ఈసీ నీలం సాహ్ని పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల్ని రద్దు చేస్తూ హైకోర్ట్ సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో ఎస్ఈసీ పిటిషన్ దాఖలు చేశారు. పరిషత్ ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నీలం సాహ్నికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను మే 21న హైకోర్టు రద్దు చేసింది. పరిషత్ ఎన్నికలకు కొత్తగా తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికలు జరగలేదని హైకోర్టు స్పష్టం చేసింది.

పరిషత్ ఎన్నికలను ప్రక్రియను కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ, బిజెపి, జనసేన పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై విచారణ జరుగుతున్న క్రమంలో మార్చిలో ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తూ ఎస్ఈసీ నీలం సాహ్ని నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఎన్నికలను కొనసాగించడానికి అనుమతి ఇస్తూ తమ తీర్పు వచ్చే వరకు ఫలితాలను నిలిపేయాలని ఆదేశించింది. దాంతో ఓటింగు జరిగినప్పటికీ ఓట్ల లెక్కింపు ఆగిపోయింది. 

Latest Videos

Also Read:నీలం సాహ్నికి హైకోర్టు షాక్: పరిషత్ ఎన్నికలు రద్దు, సవాల్ చేసే యోచన

ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్న సమయంలో పరిషత్ ఎన్నికల ప్రక్రియను మధ్యలో ఆపేశారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆయన మధ్యలోనే ఎన్నికలను వాయిదా వేశారు. కోర్టు అనుమతితో తిరిగి ఎస్ఈసీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించారు. పరిషత్ ఎన్నికలపై ఏ విధమైన నిర్ణయం తీసుకోకుండానే పదవీ విరమణ చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో ఎస్ఈసీగా నియమితులైన నీలం సాహ్ని ఆగిపోయిన దగ్గరి నుంచి పరిషత్ ఎన్నికలను నిర్వహిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. దాంతో ఓటింగ్ ప్రక్రియ కొనసాగినప్పటికీ కోర్టు ఆదేశాలతో ఓట్ల లెక్కింపు ఆగిపోయింది. 

click me!