పంచాయితీ ఎన్నికల విధులకు వారు దూరం... ఎస్ఈసీ కీలక నిర్ణయం

Published : Feb 07, 2021, 08:44 AM ISTUpdated : Feb 07, 2021, 09:04 AM IST
పంచాయితీ ఎన్నికల విధులకు వారు దూరం... ఎస్ఈసీ కీలక నిర్ణయం

సారాంశం

పంచాయితీ ఎన్నికల్లో పాల్గొనే ఉద్యోగుల విషయంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.  

అమరావతి: రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల విధుల విషయం ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో 50 ఏళ్లు పైబడిన ఉద్యోగులతో పాటు గర్భిణులు, బాలింతలకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపునిచ్చింది. ఈ మేరకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

కరోనా నేపథ్యంలో ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని అమరావతి జేఏసీ ఎస్ఈసీని కోరింది. ఈ వినతిని పరిగణలోకి తీసుకున్న ఎస్ఈసీ గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులు, 50 ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక జబ్బుల(క్యాన్సర్‌, గుండె, కిడ్నీ)తో బాధపడుతున్న వారికి ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇచ్చింది.  

read more  పెద్దిరెడ్డిపై నిమ్మగడ్డ ఆదేశాలు: ఏపీ హైకోర్టుకెక్కిన జగన్ సర్కార్

ఇదిలావుంటే పంచాయితీ ఎన్నికల విదులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఇప్పటికే ఎస్ఈసి నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఎన్నికల ప్రదానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియను తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియ తర్వాతి స్థానంలో సంక్షేమాన్ని  చేపట్టాలని అధికారులను ఆదేశించారు.  
 

PREV
click me!

Recommended Stories

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ముక్కోటి దేవతలకు ఆహ్వానం | Tirumala Srivari Brahmotsavam | Asianet
తిరుమల ఆలయంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన CM చంద్రబాబు | CM Chandrababu Unveils New Calendar