ఆంధ్రప్రదేశ్ మంత్రి పినిపె విశ్వరూప్ శుక్రవారం నాడు అస్వస్థతకు గురయ్యారు. ఆయనను రాజమండ్రిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
రాజమండ్రి: ఏపీ మంత్రి పినిపె విశ్వరూప్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను రాజమండ్రిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం నాడు అమలాపురంలో జరిగిన వైఎస్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత విశ్వరూప్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటనే రాజమండ్రిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఎడమ చేయి, ఎడమ వైపు ముఖం లాగుతున్నట్టుగా చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆయనను రాజమండ్రి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.మంత్రి విశ్వరూప్ ను రాజమండ్రిలోని ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు పరీక్షించారు..
గుండెపోటుకు సంబంధించిన లక్షణాలతో మంత్రి విశ్వరూప్ ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అనే విషయమై వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అయితే ఇంకా రెండు రోజుల పాటు తమ పర్యవేక్షణలోనే మంత్రి ఉండాలని కూడా వైద్యులు చెప్పారు. మెరుగైన వైద్య సహయం కోసం ఆయనను హైద్రాబాద్ కు తరలించాలని మంత్రి కుటుంబ సభ్యులు భావిస్తున్నారని సమాచారం. మంత్రి అస్వస్థతకు గురి కావడానికి గల కారణాలపై వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఉన్నట్టుండి మంత్రి విశ్వరూప్ అస్వస్థతకు గురికావడంతో ఆయన అనుచరులు, పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే మంత్రి విశ్వరూప్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసిందిమంత్రి అస్వస్థతకు గల కారణాలు పరీక్షల్లో వెల్లడి కానుందని వైద్యులు చెబుతున్నారు.