ఒకరికి క్రెడిబిలిటీ లేదు.. మరొకరికి క్యారెక్టర్ లేదు : చంద్రబాబు, పవన్‌లపై మంత్రి కాకాని వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jul 13, 2022, 03:51 PM IST
ఒకరికి క్రెడిబిలిటీ లేదు.. మరొకరికి క్యారెక్టర్ లేదు : చంద్రబాబు, పవన్‌లపై మంత్రి కాకాని వ్యాఖ్యలు

సారాంశం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌లపై ఏపీ మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకరికి క్రెడిబిలిటీ లేదు...మరొకరికి క్యారెక్టర్ లేదంటూ దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు కడుపుమంటతో విమర్శలు చేస్తున్నాయని గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. 

చంద్రబాబు (chandrababu naidu) ఆత్మహత్య చేసుకున్న రైతులను కూడా మోసం చేసారని ఆరోపించారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి (kakani govardhan reddy) . బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి కూడా మెచ్చుకున్నారని గుర్తుచేశారు. మూడేళ్ళ నుంచి ధాన్యం 16 నుంచి 17 లక్షల టన్నుల ధాన్యం ఎక్కువగా వస్తోందని కాకాని తెలిపారు. చంద్రబాబుకు నీతి నిజాయితీ లేదని.. రైతులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఒకరికి క్రెడిబిలిటీ లేదు...మరొకరికి క్యారెక్టర్ లేదంటూ పవన్ (pawan kalyan) , చంద్రబాబులపై (chandrababu naidu) మంత్రి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

దత్తపుత్రుడు రెండు చోట్లా ఓడిపోయాడని.. సిగ్గుంటే రాజకీయాల నుంచి తప్పుకోవాలని గోవర్థన్ రెడ్డి సవాల్ విసిరారు. పట్టాదారు పాస్ బుక్, సీసీఆర్‌సీ కార్డు ఉన్న ప్రతి రైతుకు పరిహారం ఇస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు కడుపుమంటతో విమర్శలు చేస్తున్నాయని.. వరదల వల్ల ప్రాథమికంగా 1800 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ఆయన దుయ్యబట్టారు. పంట నష్టపోయిన చోట్ల గతంలో మాదిరిగా పరిహారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గోదావరి వరదలతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని గోవర్థన్ రెడ్డి వెల్లడించారు. 

ALso Read:పవన్ జనసేన అధ్యక్షుడే అయినా... పార్టీని నడిపించేది ఆయనే..: కాపు కార్పోరేషన్ ఛైర్మన్ సంచలనం

ఇకపోతే .. ఏపీ కాపు కార్పోరేషన్ ఛైర్మన్ అడపా శేషు నిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసం తాను కాపును అని చెప్పుకోలేని వ్యక్తి కూడా చివరకు కాపుల గురించి మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడు ఏమాత్రం కాదు... ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని ఎద్దేవా చేసారు. జనసేన పార్టీ (janasena party) అధ్యక్షుడు పవనే అయినా... దాన్ని నడిపించేది మాత్రం నాదెండ్ల మనోహర్ (nadendla manohar) అంటూ శేషు సంచలన వ్యాఖ్యలు చేసారు. 

విజయవాడలో అనేక పార్టీ కార్యాక్రమాలు చేస్తున్న పవన్ కల్యాణ్ కు పక్కనే వున్న కాపు నాయకుడు వంగవీటి మోహనరంగా విగ్రహానికి కనీసం ఒక్కసారయినా పూల మాల వేసాడా? అని శేషు ప్రశ్నించారు. అలాంటిది ఆయన గురించి మాట్లాడే హక్కు పవన్ కు ఎక్కడదని నిలదీసారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో వుండగా కాపులు అనేక ఇబ్బందుకుల గురయ్యారని... ఆ సమయంలో పవన్ ఎమయ్యాడు? అని అడపా శేషు నిలదీసారు. 

పవన్ కల్యాణ్, జనసేన పార్టీ కాపుల పేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఆయన కులాలు, మతాల పేరిట చేసే రాజకీయాలను కాపు సామాజికవర్గ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కాపు కార్పొరేషన్ ని సీఎం జగన్ సక్రమంగా నడిపిస్తున్నారని... వారికి ఏం కావాలో అవే చేస్తున్నారని శేషు పేర్కొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?