ఉరిశిక్షకు రెడీ.. మంత్రి ఆది కామెంట్స్

Published : Nov 15, 2018, 10:17 AM IST
ఉరిశిక్షకు రెడీ.. మంత్రి ఆది కామెంట్స్

సారాంశం

జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి విషయంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. 

వైసీపీ అధినేత జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి విషయంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. జగన్ పై దాడి కుట్రలో ఆదినారాయణ రెడ్డి హస్తం ఉందంటూ పలువురు వైసీపీ నేతలు ఆరోపించారు. అంతేకాకుండా ఆయనపై వైసీపీ నేతలు రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశారు. 

కాగా.. ఆ ఆరోపణలకు మంత్రి ఆది సమాధానం ఇచ్చారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘కోడికత్తి కేసులో నా ప్రమేయం ఉందని నిరూపిస్తే ఉరి శిక్షకైనా సిద్ధమే. ఈ కేసులో నా పాత్రని నిరూపించకపోతే, వారికి ఏ శిక్ష వేయాలో వారే నిర్ణయించుకోవాలి. ప్రజా కోర్టులో నిజా నిజాలు తెలుస్తాయి. అందుకు వైసీపీ నాయకులు సిద్ధం కావాలి. కోడికత్తి కేసుపై సీఎం చంద్రబాబు, డీజీపీ, మరికొందరితోపాటు నాపై ఏ ఆధారాలతో వైసీపీ నేతలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారో చెప్పాలి. దాడి జరిగితే ఇక్కడ నవ్వుతూ ఉన్న జగన్‌ హైదరాబాద్‌ వెళ్లి ఆసుపత్రిలో చేరటం ఓ హైలెవల్‌ డ్రామా. దాడి ఘటన డూప్‌. జగన్‌ మాటలు డూప్‌’’ అని పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu