చర్చలతో పరిష్కరించుకోవాలి: ఉద్యోగులకు మంత్రి ఆదిమూలపు సురేష్ పిలుపు

By narsimha lode  |  First Published Feb 3, 2022, 4:30 PM IST


తమ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి  ఆదిమూలపు సురేష్ కోరారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.


అమరావతి: ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సమస్యలను ప్రభుత్వంతో చర్చించుకొని పరిష్కరించకోవాలని ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి Adimulapu Suresh  చెప్పారు.
 గురువారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు.PRC సాధన సమితి నిర్వహించిన ఛలో విజయవాడ కార్యక్రమంపై ఆయన స్పందించారు. Employees ఆందోళన బాట పట్టడం సరైంది కాదన్నారు. ఉద్యోగులు సంయమనం పాటించాలని ఆయన కోరారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని కూడా అర్ధం చేసుకోవాలని ఆయన ఉద్యోగులను కోరారు.విద్యా రంగంలో  తీసుకొచ్చిన సంస్కరణలు Teachersకు తెలుసునని ఆయన గుర్తు చేశారు. ఎవరినీ కూడా ఇబ్బంది పెట్టొద్దని కూడా మంత్రి కోరారు.

ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా భాగమేననే విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. గత మాసంలో సీఎం సమక్షంలో జరిగిన ఒప్పందాలను ఉద్యోగ సంఘాలు గౌరవించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగంగా హెచ్ఆర్ఏ నిర్ణయించామని మంత్రి తెలిపారు.

Latest Videos

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు జనవరి 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం   YS Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు.  అయితే జనవరి 17వ తేదీ రాత్రి పీఆర్సీపై  ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్ పై ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందించలేదు. దీంతో సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకొన్నాయి.  జనవరి 24న రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె  నోటీసును అందించాయి.  ఈ నెల 7వ తేదీ వరకు  ఉద్యోగ సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే  ఇవాళ చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. 
 

click me!