అచ్చెన్నాయుడు బైక్ ర్యాలీలో అపశృతి: కుప్పకూలిన వైసీపీ హోర్డింగ్, నలుగురికి గాయాలు

Published : Jan 10, 2019, 12:19 PM IST
అచ్చెన్నాయుడు బైక్ ర్యాలీలో అపశృతి: కుప్పకూలిన వైసీపీ హోర్డింగ్, నలుగురికి గాయాలు

సారాంశం

 ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుకు ప్రమాదం నుంచి బయటపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పాల్గొన్న మంత్రి ఎస్కార్ట్ వాహనంపై ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోర్డింగ్ పడింది.   

శ్రీకాకుళం: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుకు ప్రమాదం నుంచి బయటపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పాల్గొన్న మంత్రి ఎస్కార్ట్ వాహనంపై ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోర్డింగ్ పడింది. 

అయితే ఈ ప్రమాదంలో మంత్రి అచ్చెన్నాయుడు తృటిలో తప్పించుకున్నారు. అప్పటికే మంత్రి అచ్చెన్నాయుడు వాహనం ముందుకు వెళ్లిపోవడంతో వెనుక వచ్చిన కార్యకర్తలపై హోర్డింగ్ పడింది. దీంతో నలుగురు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. మంత్రికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Government Jobs : తెలుగు యువతా బి రెడీ .. భారీ జాబ్ నోటిఫికేషన్ రాబోతోంది
AP Power Sector : ఏపీకి కొత్త పవర్ ప్లాన్.. తీరనున్న కరెంట్ కష్టాలు..భవిష్యత్ కోసం బ్యాటరీ స్టోరేజ్