మానవత్వం చాటుకున్న హోం మంత్రి సుచరిత: శభాష్ అంటూ పబ్లిక్ కితాబు

By Nagaraju penumalaFirst Published Aug 28, 2019, 5:14 PM IST
Highlights

యువకుడు ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నాడని తెలుసుకున్న మంత్రి సుచరిత కాన్వాయ్ ఆపారు. ఆ యువకుడికి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ యువకుడు కోలుకునేవరకు అక్కడే ఉన్నారు. ఆ యువకుడు కోలుకున్న తర్వాత అతడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఫిట్స్ తో బాధపడుతున్న యువకుడికి ప్రాథమిక చికిత్స అందించి తన ఉదారతను చాటుకున్నారు. 

వివరాల్లోకి వెళ్తే సెక్రటేరియట్ నుంచి గుంటూరుకు కాన్వాయ్ తో వెళ్తున్న హోంశాఖ మంత్రి మేకతోటి సుచరితకు కోలనుకొండ వద్ద డీజీపీ ఆఫీస్ ఎదురుగా ఉన్న విజయవాడ–చెన్నై జాతీయ రహదారిపై ఒక యువకుడు ఫిట్స్ వ్యాధితో కొట్టుకుంటూ కనిపించాడు.

అదేరోడ్డుపై చాలా మంది రాకపోకలు సాగిస్తున్నప్పటికీ ఆ యువకుడిని ఎవరూ పట్టించుకోలేదు. యువకుడు ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నాడని తెలుసుకున్న మంత్రి సుచరిత కాన్వాయ్ ఆపారు. ఆ యువకుడికి ప్రాథమిక చికిత్స అందించారు. 

ఆ యువకుడు కోలుకునేవరకు అక్కడే ఉన్నారు. ఆ యువకుడు కోలుకున్న తర్వాత అతడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నెల్లూరుకు చెందిన ఆ యువకుడు వ్యక్తిగత పనుల నిమిత్తం లారీలో ప్రయాణిస్తున్నాడు. మధ్యలో ఫిట్స్ రావడంతో లారీ డ్రైవర్ లారీ నుంచి కిందకు దించేసి వెళ్లిపోయినట్లు తెలిపారు.  

నెల్లూరులో అతని అక్కకు ఫోన్ చేయించారు మంత్రి సుచరిత. అనంతరం పోలీసుల సహకారంతో ఆ యువకుడడిని నెల్లూరుకు బస్ లో పంపించారు. హోమంత్రి సుచరిత మానవత్వంతో స్పందించిన తీరుకు అక్కడ ఉన్నవారంతా అభినందించారు. 

click me!