జగన్ సర్కార్‌కు ఊరట.. ఏలూరు కార్పోరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్, కానీ..?

By Siva KodatiFirst Published Mar 9, 2021, 5:25 PM IST
Highlights

ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్‌ ఎన్నికలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నిన్న సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం కొట్టివేసింది. అయితే ఫలితాలు మాత్రం ప్రకటించొద్దని ఎస్ఈసీని హైకోర్టు ఆదేశించింది. 

ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్‌ ఎన్నికలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నిన్న సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం కొట్టివేసింది. అయితే ఫలితాలు మాత్రం ప్రకటించొద్దని ఎస్ఈసీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 

ఏలూరు కార్పోరేషన్  ఎన్నికలను నిలిపివేయాలని హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ  రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

ఏలూరు పరిధిలోని ఓటర్ల జాబితా, వార్డుల పునర్విభజన అంశంపై 40కిపైగా పిటిషన్లు దాఖలయ్యాయి.   టీడీపీకి చెందిన కొందరు నేతలు కూడ పిటిషన్లు దాఖలు చేశారు.పారం-7 ఉపయోగించుకొని టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించారని ఆ పిటిషన్ లో  ఆరోపించారు. జాబితాలోని అవకతవకలను సవరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. 

Also Read:ఏలూరు కార్పోరేషన్ ఎన్నికలపై స్టే: లంచ్ మోషన్‌ పిటిషన్ దాఖలు చేసిన జగన్ సర్కార్

అయితే ఈ ఆదేశాలు అమల్లోకి రాకముందే ఎన్నికల నోటిషికేషన్ జారీ అయింది. దీంతో కోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది.  ఈ విషయమై ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్ లో 50 డివిజన్లున్నాయి. వీటిలో 3 స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకొంది. మిగిలిన 47 స్థానాలకు ఎన్నికలను జరుగుతున్నాయి.
 

click me!