25 దేవాలయాలకు పాలకమండళ్లు: నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ

By Siva KodatiFirst Published Sep 30, 2019, 4:54 PM IST
Highlights

రాష్ట్రంలోని 25 దేవాలయాలకు పాలక మండళ్లు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం అనుమతించింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.కోటి-రూ.5 కోట్ల మధ్య వార్షికాదాయం ఉన్న అన్ని ఆలయాలకు పాలకమండలి ఏర్పాటు చేశారు. 

రాష్ట్రంలోని 25 దేవాలయాలకు పాలక మండళ్లు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం అనుమతించింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.కోటి-రూ.5 కోట్ల మధ్య వార్షికాదాయం ఉన్న అన్ని ఆలయాలకు పాలకమండలి ఏర్పాటు చేశారు.

ఇందులో శ్రీకాకుళం అరసవిల్లి సూర్యనారాయణ స్వామి, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి, అంతర్వేది, అమరావతి, పాలకొల్లు సహా పలు ఆలయాలు ఉన్నాయి.

హిందూ ధార్మిక సంస్థలు, ట్రస్టుల చట్టం ప్రకారం పాలకమండళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఏపీ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. 

click me!