రేపటి నుంచి ఒకే మాట.. కలిసి పోరాడతాం : పీఆర్సీపై ఏకతాటిపైకి ఉద్యోగ సంఘాలు

By Siva KodatiFirst Published Jan 20, 2022, 7:24 PM IST
Highlights

పీఆర్సీపై (prc) రేపటి నుంచి ఒకటే డిమాండ్, ఒకటే ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతామని ఏపీ ఉద్యోగ సంఘాలు (ap govt employees) తెలిపాయి. గురువారం ఉద్యోగ సంఘాల నేతలు అమరావతిలో సమావేశమయ్యాయి. 

పీఆర్సీపై (prc) రేపటి నుంచి ఒకటే డిమాండ్, ఒకటే ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతామని ఏపీ ఉద్యోగ సంఘాలు (ap govt employees) తెలిపాయి. గురువారం ఉద్యోగ సంఘాల నేతలు అమరావతిలో సమావేశమయ్యాయి. ఈ భేటీ అనంతరం సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. తామంతా ఇప్పటి వరకు సంఘాలుగా విడివిడిగా పోరాడమన్నారు. కానీ ఇక నుంచి ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ కోసం ఉమ్మడిగా పోరాడతామని వెంకట్రామిరెడ్డి తెలిపారు. రేపు మరోసారి అందరితో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. బొప్పరాజు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో 13 లక్షల మంది ఉద్యోగుల శ్రేయస్సు కోసం నాలుగు సంఘాలు ఏక తాటిపైకి వచ్చాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలతో ఉద్యోగులకు నష్టమని బొప్పరాజు అన్నారు. దీనిపై రేపు సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో నాలుగు సంఘాలు కలిసి ఐక్య కార్యచరణపై చర్చిస్తామని వెంకటేశ్వర్లు తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం పీఆర్సీ(PRC)పై జారీ చేసిన కొత్త జీవో(GO)లపై ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. కొత్త పీఆర్సీతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని మండిపడుతున్నాయి. ఆందోళనలు చేస్తున్నాయి. ఏపీ NGOతో పాటు ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం సహా  పలు ఉద్యోగ సంఘాలు(Employees Union), ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆందోళనకు సిద్దమంటూ ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణలు ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద కనిపించారు. వీరు ఇరువురూ సీఎంవో కార్యాలయానికి వెళ్లారు.

కాగా.. సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం Ys Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు.  అయితే ఈ నెల 17వ తేదీ రాత్రి పీఆర్సీపై  ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. 30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.

click me!