సచివాలయం కొలువులకు జగన్ సర్కార్ ఝలక్: మీమాంసలో ఉద్యోగులు

By Nagaraju penumalaFirst Published Oct 3, 2019, 11:17 AM IST
Highlights


గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఖచ్చితంగా మూడేళ్లు పనిచేయాలని అలాగే మధ్యలో ఉద్యోగం మానేస్తే వారికి అందించిన గౌరవ వేతనంతో పాటు శిక్షణ కోసం ప్రభుత్వం చేసిన వ్యయాన్ని కూడా తిరిగి చెల్లించాలంటూ కండీషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. 

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సచివాలయం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఝలక్ ఇచ్చింది. ఎన్నో ఆశలతో ప్రభుత్వ కొలువు సంపాదించమనుకున్న ఉద్యోగులకు అపాయింట్మెంట్ ఆర్డర్ చూడగానే చుక్కలు కనబడుతున్నాయన్న ప్రచారం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మూడేళ్ళు పనిచెయ్యాలని నిబంధన ఉండటంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని సమాచారం. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల చేయాలనుకుంటే కచ్చితంగా మూడేళ్లపాటు పని చేసి తీరాల్సిందేనని కండీషన్స్ అప్లై చేసినట్లు సమాచారం. 

అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌లో ప్రభుత్వం పెట్టిన నిబంధనతో గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారు రెండేళ్లు ప్రొబేషనరీ పిరియడ్ అంటూ స్పష్టం చేయడంతో ఏంచేయాలో తోచక దిక్కుతోచని స్థితిలో ఉన్నారట సచివాలయ ఉద్యోగులు.   

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఖచ్చితంగా మూడేళ్లు పనిచేయాలని అలాగే మధ్యలో ఉద్యోగం మానేస్తే వారికి అందించిన గౌరవ వేతనంతో పాటు శిక్షణ కోసం ప్రభుత్వం చేసిన వ్యయాన్ని కూడా తిరిగి చెల్లించాలంటూ కండీషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. 

ఇకపోతే ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు పలు పోటీ పరీక్షలు రాసి ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. ఇలాంటి తరుణంలోరెండేళ్లు ప్రొబేషనరీ పిరియడ్, మూడేళ్లు ఖచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది, మధ్యలో మానేస్తే తీసుకున్న వ్యయాన్ని తిరిగి చెల్లించాలనే నిబంధనతో ఆ అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. 

ఇదిలా ఉంటే నోటిఫికేషన్‌లో రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌ పనిచేయాలని మాత్రమే పేర్కొన్నారని, మూడేళ్లు కచ్చితంగా పనిచేయాలన్న నిబంధన అందులో లేదని కొంతమంది అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు.  

సచివాలయం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు మరేదైనా మంచి జాబ్ వస్తే దానికి వెళ్లాలంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.  ఈ పరిణామాల నేపథ్యంలో గ్రామ సచివాలయ ఉద్యోగాలు చేయాలా వద్దా అనే మీమాంసలో కొందరు ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇంత కఠినమైన నిబంధనలతో, గౌరవ వేతనానికే ఈ ఉద్యోగం చేయడం అవసరమా అన్న ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా గ్రామ సచివాలయ ఉద్యోగాల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉద్యోగులకు షాక్ అనే చెప్పాలి. మెుత్తానికి అభ్యర్థుల్లో నెలకొన్న ఆందోళన, జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. 

click me!