రంగంలోకి పోలీసులు: టోల్ పీజు వసూలుపై ఏపీ సర్కార్ సీరియస్

By narsimha lodeFirst Published Jan 13, 2019, 2:27 PM IST
Highlights

టోల్‌ప్లాజాల వద్ద టోల్ రుసుమును వసూలు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో  ఏపీ సర్కార్ సీరియస్‌గా తీసుకొంది.  


విజయవాడ: టోల్‌ప్లాజాల వద్ద టోల్ రుసుమును వసూలు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో  ఏపీ సర్కార్ సీరియస్‌గా తీసుకొంది.  కీసర టోల్‌ప్లాజా వద్ద స్థానిక పోలీసులతో వాహనాలను  పంపించివేస్తున్నారు.

టోల్‌ప్లాజాల వద్ద టోల్ ఫీజును వసూలు చేయకూడదని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలను టోల్ నిర్వాహకులు పట్టించుకోలేదు. దీంతో ఏపీ సర్కార్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొంది.

స్థానిక పోలీసుల సహాయంతో టోల్ ఫీజు  వసూలు చేయకుండా  వాహనాలను పంపించివేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు కీసర టోల్‌గేట్ వద్ద స్థానిక ఎస్ఐ ఆధ్వర్యంలో  వాహనాలను పంపించివేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని టోల్ గేట్ల వద్ద ఇదే పద్దతిని అమలు చేయాలని  కూడ ఏపీ సర్కార్ భావిస్తోంది.

click me!