ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూను పొడిగించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకొంది. ఇవాళ కరోనాపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.మంగళవారం నాడు కరోనాపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షలో రాష్ట్రంలో కరోనా కేసులు, రోగుల రికవరీ యాక్టివ్ కేసులు తదితర అంశాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
మంగళవారం నాడు కరోనాపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షలో రాష్ట్రంలో కరోనా కేసులు, రోగుల రికవరీ యాక్టివ్ కేసులు తదితర అంశాలపై చర్చించారు. pic.twitter.com/8UsknqBHQa
undefined
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. దీంతో కరోనా కేసుల వ్యాప్తిని తగ్గించేందుకు గాను రాష్ట్రప్రభుత్వం మరో వారం రోజుల పాటు రాత్రిపూట కర్ఫ్యూను పొడిగించాలని నిర్ణయం తీసుకొంది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతోందని జగన్ సర్కార్ మంగళవారం నాడు ప్రకటించింది.
ఈ నెల 15 నుండి 21 వరకు నైట్ కర్ప్యూను పొడిగించింది జగన్ సర్కార్. రేపటితో ఈ గడువు పూర్తికానుంది.దీంతో మరో వారం పాటు కర్ఫ్యూను పొడిగించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకొంది. మాస్కు ధరించనివారికి జరిమానాను విధించాలని కూడ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.