ఓ గ్యాంగ్ మాటలనే వల్లే వేశారు:హరీష్ రావుకు సజ్జల కౌంటర్

By narsimha lodeFirst Published Sep 30, 2022, 2:04 PM IST
Highlights


తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వాళ్ల సమస్యలపై మాట్లాడకుండా పక్క రాష్ట్రంపై వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని సజ్జల అభిప్రాయపడ్డారు. 
 


అమరావతి:తమ రాష్ట్రంలోని  సమస్యలు చూసుకోకుండా ఏపీ పై కామెంట్ చేయడం సరైంది కాదని  ఏపీ రాష్ట్రప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలంగాణ మంత్రి హరీష్ రావుకు సూచించారు. శుక్రవారం నాడు  అమరావతిలో ఏపీ రాష్ట్రప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.  తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. 

పారదర్శకంగా సంక్షేమ పకాలు అమలు చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రజల స్పందన బాగుందన్నారు. కానీ ఈ సమయంలో తెలంగాణ మంత్రి హరీష్ రావు ఎందుకు అలా మాట్లాడారో అర్ధం కావడం లేదని చెప్పారు.హరీష్ రావుకు ఎందుకు ఆవేశం వచ్చిందో తెలియదన్నారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య అంశం కాదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. రెండు రాష్ట్రాల అంశంపై హరీష్ రావు మాట్లాడలేదన్నారు. 

సీఎం జగన్ ను విమర్శించి రెచ్చగొట్టాలని చూస్తున్నట్టుగా కన్పిస్తుందని సజ్జల అనుమానించారు. ఓ గ్యాంగ్ ఏమంటుందో దాన్నే వాళ్లంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఆ గ్యాంగ్ తో జతకట్టి హరీష్ రావు  మాట్లాడినట్టుగా అనిపిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ పార్టీగా తమపై విమర్శలు చేయలేదన్నారు.కానీ హరీష్ రావుకు వ్యక్తిగత సమస్యలున్నాయో తెలియదని  సజ్జల చెప్పారు. తాము ఏనాడూ తెలంగాణపై విమర్శలు చేయలేదని ఆయన గుర్తు చేశారు. మంత్రి హరీష్ రావుపై కామెంట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. 

ఏ రాష్ట్రం సమస్యలను వారే చూసుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో కూడా పొత్తులు ఉండబోవని సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు.ఏపీ రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. ఏ ఫ్రంట్ లోనూ తాము చేరబోమన్నారు. గడప గడపకు కార్యక్రమంపై సీఎం జగన్ ప్రసంగంపై ఊహగానాలు వచ్చాయన్నారు. తాను వెళ్లాల్సిన అవసరం లేనందున నియోజకవర్గాల్లో తన తమ్ముళ్లు తిరుగుతున్నారని సీఎం చెప్పారన్నారు.అందరూ కలిసి పనిచేయాలని సీఎం చెప్పారని  ఆయన గుర్తు చేశారు. 

ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వంలో చోటుచేసుకుంటున్నపరిణామాలను ప్రస్తావిస్తూ  మంత్రి హరీష్ రావు విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లపై కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. . కానీ తెలంగాణలో  మాత్రం టీచర్లకు 73 శాతం పిట్ మెంట్ ఇచ్చామన్నారు. ఏపీ ప్రభుత్వం వ్యవసాయ పంప్ సెట్లకు మీటర్లు బిగిస్తుందన్నారు. కేంద్రం షరతుల మేరకు  వ్యవసాయ మోటార్లకు ఏపీ ప్రభుత్వం మీటర్లు బిగిస్తుందని ఆయన విమర్శించారు. ఇటీవల తిరుపతికి వెళ్లిన సమయంలో కొందరితో తాను మాట్లాడానన్నారు. విద్యుత్ విషయంలో తాముఇబ్బందులు పడుతున్నట్టుగా ఏపీ వాసులు చెప్పిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు. దీంతో తెలంగాణ నేతలను ఏపీకి పంపిస్తే తెలంగాణ ఏ రకంగా ముందుందో తెలుస్తుందన్నారు హరీష్ రావు 

click me!