రేపు కృష్ణా జిల్లాలో చంద్రబాబు పర్యటన: వరద బాధితులకు పరామర్శ

Published : Aug 19, 2019, 09:30 PM IST
రేపు  కృష్ణా జిల్లాలో చంద్రబాబు పర్యటన: వరద బాధితులకు పరామర్శ

సారాంశం

ఈనెల 20న కృష్ణా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో చంద్రబాబు పర్యటించనున్నారు. విజయవాడ తూర్పు, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. వరద ధాటికి తీవ్రంగా నష్టపోయిన బాధితులను చంద్రబాబు నాయుడు పరామర్శించనున్నారు. 

అమరావతి: కృష్ణానది వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మంగళవారం కృష్ణా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 

మంగళవారం అంటే ఈనెల 20న కృష్ణా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో చంద్రబాబు పర్యటించనున్నారు. విజయవాడ తూర్పు, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. 

వరద ధాటికి తీవ్రంగా నష్టపోయిన బాధితులను చంద్రబాబు నాయుడు పరామర్శించనున్నారు. వరదల కారణంగా నీట మునిగి దెబ్బతిన్న పంటలను చంద్రబాబు పరిశీలించనున్నారు. 

పంట నష్టపోయిన రైతులకు చంద్రబాబు పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించనున్నారు. పడవలు దెబ్బతిన్న మత్స్యకారులకు చంద్రబాబు ధైర్యాన్ని ఇవ్వనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!