ఏపీ ఆర్ధిక శాఖ సర్క్యులర్:పీఆర్సీ సాధన సమితి నేతల కీలక భేటీ

By narsimha lode  |  First Published Jan 27, 2022, 5:03 PM IST


;పీఆర్సీ సాధన సమితి నేతలు గురువారం నాడు సచివాలయంలో భేటీ అయ్యారు. ఆర్ధిక శాఖ ఆధ్వర్యంలో సర్క్యులర్  తో పాటు ప్రభుత్వం నుండి చర్చల కోసం వచ్చిన ఆహ్వానాలపై కూడా నేతలు చర్చించనున్నారు.


అమరావతి: PRC  సాధన సమితి నేతలు గురువారం నాడు సాయంత్రం సచివాలయంలో భేటీ అయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై  ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. చర్చలకు రాకుండా షరతులు పెట్టడం ఏమిటని ప్రభుత్వం ప్రశ్నిస్తుంది.

చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు Sajjala Ramakrishna Reddy చెప్పారు.చర్చలకు రమ్మని తామే కోరుతున్నామని సజ్జల తెలిపారు. అయినా చర్చలకు రాకుండా మొండికి వేయడం తగదని హితవు పలికారు. చర్చలకు వస్తేనే కదా? కమిటీలో చర్చిస్తేనే కదా? అసలు సమస్య ఏంటో తెలిసేది అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 

Latest Videos

ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగులను మూడు దఫాలు చర్చలకు పిలిచింది. మరోసారి కూడా చర్చలకు రావాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. అయితే ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో  ఉద్యోగ సంఘాల భేటీకి ప్రాధాన్యత నెలకొంది.

మరో వైపు January నెల జీతాలను కొత్త పీఆర్సీ మేరకు ఇవ్వాలని ఏపీ సర్కార్ ప్రయత్నాలు ప్రారంభించింది. కొత్త పీఆర్సీ మేరకు జీతాల బిల్లులను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయడంతో పాటు ప్రాసెస్ చేయాలని కూడా ఆర్ధిక శాఖ ఆదేశించింది. ఒకవేళ అలా చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తీసకొంటామని కూడా హెచ్చరించింది. ఈ వార్నింగ్ పై కూడా ఉద్యోగ సంఘాల నేతలు చర్చిస్తున్నారు.

పీఆర్సీ కొత్త జీవోలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ తో పాటు ఇతర డిమాండ్లతో ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగనున్నారు. వచ్చే నెల 7వ తేదీ నుండి ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగనున్నాయి. ఈ మేరకు ఉద్యోగ సంఘాలు Strike నోటీసును ఇచ్చాయి. అంతేకాదు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం   YS Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు.  అయితే ఈ నెల 17వ తేదీ రాత్రి పీఆర్సీపై  ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్ పై ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందించలేదు. దీంతో సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకొన్నాయి.  

click me!