AP ECET 2022 Result: ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే..

By Sumanth KanukulaFirst Published Aug 10, 2022, 12:29 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ బుధవారం ఉదయం ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షలో 92.36 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ఆంధ్రప్రదేశ్ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ బుధవారం ఉదయం ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షలో 92.36 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 91.44 శాతం, బాలికలు 95.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు వారి ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/  ‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో వెళ్లాక రిజల్ట్స్‌పై క్లిక్ చేసి.. కోర్సు, రిజిస్ట్రేషన్ నెంబర్, ఈసెట్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసిన తర్వాత.. వ్యూ రిజల్ట్ మీద క్లిక్ చేయాలి. ఈ ఏడాది ఈసెట్ పరీక్షకు 38,801 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవగా.. 36,440 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 

ఇక, ఇంజనీరింగ్ కోర్సుల్లో సెకండ్ ఈయర్‌లో ప్రవేశానికి డిప్లోమా విద్యార్థులకు ఈ సెట్ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏపీ ఈసెట్ పరీక్షను కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించారు. AP ECET 2022 పరీక్షను జూలై 22న రెండు సెషన్స్‌లో నిర్వహించారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ (ఈఈఈ), అగ్రికల్చర్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ), కెమికల్ ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించి.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరిగింది. ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ), ఫార్మసీ, మెటలర్జికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ (ఈఐఈ), మెకానికల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించి.. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష జరిగింది.

click me!