ఈ నెల 27న కోర్టుకు హాజరుకావాలి: ఏపీ డీజీపీ, హోం సెక్రటరీకి హైకోర్టు ఆదేశం

Published : Jan 25, 2021, 03:53 PM IST
ఈ నెల 27న కోర్టుకు హాజరుకావాలి: ఏపీ డీజీపీ, హోం సెక్రటరీకి హైకోర్టు  ఆదేశం

సారాంశం

ఈ నెల 27న కోర్టుకు హాజరు కావాల్సిందిగా  ఏపీ డీజీపీ, హోం సెక్రటరీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

అమరావతి : ఈ నెల 27న కోర్టుకు హాజరు కావాల్సిందిగా  ఏపీ డీజీపీ, హోం సెక్రటరీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ అధికారికి పదోన్నతి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంశంలో కోర్టు ధిక్కారం కింద ఈరోజు హాజరు కావాలని గతంలో కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. 

ఎన్నికల విధుల్లో ఉన్నందున హాజరుకాలేమని అధికారులు అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చేవరకు అన్నీ వాయిదా వేయాలని సీఎస్ కోరారని తమరేమో ఎన్నికల విధులంటున్నారు ఎలా సాధ్యమని ధర్మాసనం ప్రశ్నించింది. ఈనెల 27న కోర్టుకు హాజరు కావాలంటూ డీజీపీ, హోంసెక్రటరీకి హైకోర్టు స్పష్టం చేసింది.

స్థానిక సంస్థల ఎన్నికల అంశాన్ని చూపి కోర్టుకు హాజరుకాకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నంపై హైకోర్టు పోలీస్ ఉన్నతాధికారికి చురకలు అంటించింది. గతంలో  ఏపీ రాష్ట్ర పోలీసుల తీరును ఏపీ హైకోర్టు తప్పుబట్టిన విషయం తెలిసిందే. . 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu