అవినీతిని నిరూపిస్తే ఉరికి సిద్దమే: చంద్రబాబుకి ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సవాల్

Published : Aug 27, 2021, 01:33 PM IST
అవినీతిని నిరూపిస్తే ఉరికి సిద్దమే: చంద్రబాబుకి ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సవాల్

సారాంశం

తనపై చేసిన అవినీతి ఆరోపణలను రుజువు చేయాలని టీడీపీ చీఫ్  చంద్రబాబుకు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సవాల్ విసిరారు. ఈ విషయమై  కాణిపాకం ఆలయంలో సత్య ప్రమాణం చేయాలని  ఆయన సవాల్ విసిరారు.


తిరుపతి:టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడికి  ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సవాల్ విసిరారు. తనపై ఉన్న అవినీతి ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ విసిరారు.  కాణిపాకం ఆలయంలో సత్య ప్రమాణం చేసేందుకు రావాలని ఆయన చంద్రబాబుకు సవాల్ విసిరారు.శుక్రవారం నాడు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు.  కాణిపాకంలో  సత్య ప్రమాణం చేసేందుకు చంద్రబాబునాయుడు రావాలని ఆయన కోరారు. తనపై చేసిన అవినీతిని చంద్రబాబు నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. 

తాను  చేసిన అవినీతి ఏమిటో చంద్రబాబు నిరూపించాలని ఆయన కోరారు. తనపై చేసిన విమర్శలు రుజువు చేస్తే ఉరి తీసుకొనేందుకైనా సిద్దమేనని ఆయన చెప్పారు.చంద్రబాబు అవినీతిని బయటపడితే ఉరి తీసుకొనేందుకు సిద్దమా అని ఆయన ప్రశ్నించారు.దళితుల కోసం చంద్రబాబు ఒక్క కార్యక్రమానికి కూడ  చేయలేదన్నారు.చంద్రబాబునాయుడు  కూడా తన మాదిరిగానే సామాన్య కుటుంబం నుండి వచ్చాడనన్నారు. ఆయనకు ఉన్న ఆస్తుల గురించి తాను ప్రశ్నించడం లేదన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్