మోడల్ టౌన్స్ గా కడప, పులివెందుల: ఇడుపులపాయ టూరిజం సర్క్యూట్ పై జగన్ సమీక్ష

By Nagaraju penumalaFirst Published Nov 25, 2019, 6:02 PM IST
Highlights

పులివెందుల మోడల్ టౌన్ గా రూపుదిద్దుకునేందుకు అవసరమయ్యే సహాయాన్కని పులివెందుల ఏరియా డవలప్‌మెంట్‌ ఏజెన్సీ(పాడా) నుంచి తీసుకొవాలని సూచించారు. పులిచింతలలో వైయస్ఆర్ ఉద్యానవనం ప్రణాళికకు సంబంధించి నివేదికన సీఎం జగన్ కు అందజేశారు అధికారులు. 
 

అమరావతి: కడప, పులివెందులను మోడల్ టౌన్స్ గా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఇడుపులపాయ టూరిజం సర్క్యూట్‌ పై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాయలంలో సీఎం జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. 

సమీక్షా సమావేశంలో టూరిజం ప్రాజెక్టులపై పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు అధికారులు. వైఎస్‌ఆర్‌ మెమోరియల్‌ గార్డెన్, బొటానికల్‌ గార్డెన్, గండి టెంపుల్‌ కాంప్లెక్స్, ఐఐటీ క్యాంపస్, ఎకో పార్క్, జంగిల్‌ సఫారీ, పీకాక్‌ బ్రీడింగ్‌ సెంటర్‌ ఎస్టిమేషన్‌ వివరాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు తెలిపారు. 

ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం వైఎస్ జగన్. బ్యూటిఫికేషన్‌ పెరిగే విధంగా ఆర్కిటెక్చర్స్‌ ఉండాలని సూచించారు. ఏ పని చేసినా దీర్ఘకాలికంగా మన్నికతో పాటు ప్రాజెక్టును ఆకర్షణీయంగా ఉండేలా దూపొందించాలని ఆదేశించారు. 

కాలక్రమేణా సుందరీకరణప్రాజెక్టు వన్నె తగ్గకుండా చూసుకోవడంతో పాటు ఆకర్షణీయంగా ఉండేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పైలెట్‌ ప్రాజెక్ట్‌గా పనులు ప్రారంభించాలని ఆదేశించారు. 

పులివెందుల మోడల్ టౌన్ గా రూపుదిద్దుకునేందుకు అవసరమయ్యే సహాయాన్కని పులివెందుల ఏరియా డవలప్‌మెంట్‌ ఏజెన్సీ(పాడా) నుంచి తీసుకొవాలని సూచించారు. పులిచింతలలో వైయస్ఆర్ ఉద్యానవనం ప్రణాళికకు సంబంధించి నివేదికన సీఎం జగన్ కు అందజేశారు అధికారులు. 

అలాగే విశాఖపట్నంలో లుంబినీ పార్క్‌ అభివృద్దిని కూడా సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు అధికారులు. పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా ఇదే తరహాలో పార్క్‌ రూపొందించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. 

click me!