టిడిపి హయాంలో రూ.1.323కోట్ల బకాయిలు... చెల్లించాలని నిర్ణయించిన జగన్

Arun Kumar P   | Asianet News
Published : Jun 02, 2020, 09:08 PM IST
టిడిపి హయాంలో రూ.1.323కోట్ల బకాయిలు... చెల్లించాలని నిర్ణయించిన జగన్

సారాంశం

రాష్ట్రంలోని నిరుపేదల ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

అమరావతి: పేదల ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో
గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గృహనిర్మాణశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌జైన్‌తో సహా  ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... గత ప్రభుత్వ బకాయిలు అయినా పేదలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా ఈచెల్లింపులు చేయాలని సీఎం ఆదేశించారు. నిధులు సమీకరించుకుని చెల్లింపులకు ఒక తేదీ ప్రకటించాలని అధికారులకు సూచించారు. 

మొదటి విడతలో చేపట్టబోయే 15 లక్షల ఇళ్ల నిర్మాణంపై కూడా సీఎం జగన్ సమీక్షించారు. వైజాగ్, కర్నూల్, నెల్లూరు జిల్లాల్లో మొదటి దశలో చేపట్టబోయే ఇళ్ల సంఖ్యను పెంచేలా చూడాలని సీఎం ఆదేశించారు. నిర్దేశిత డిజైన్‌లో భాగంగా పేదలకు నిర్మించబోయే ఇళ్లలో అందిస్తున్న సదుపాయాలపై సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. డిజైన్‌లో భాగంగా బెడ్‌ రూం, కిచెన్, లివింగ్‌ రూం, టాయిలెట్, వరండా సహా సదుపాయాలు ఉండేలా చూస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. 

read more  పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో అవి తప్పనిసరి: అధికారులకు విద్యామంత్రి ఆదేశం

ఇంటి నిర్మాణంలో అన్ని రకాల జాగ్రత్తలు, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సీఎంఆదేశించారు. పేదవాడిపై ఒక్క రూపాయి అప్పు అనేది లేకుండా ఇంటిని సమకూర్చాలన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న సదుద్దేశంతో ఈ భారీ కార్యక్రమాన్ని ప్రారంభించామని...అత్యంత పారదర్శకంగా, నాణ్యతతో ఈ కార్యక్రమం కొనసాగాలన్నారు. దీని ద్వారా పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడాలన్నారు. 

గవర్నమెంటు అంటే నాసిరకం అనే పేరు పోవాలని...నాణ్యతతో పనిచేస్తుందనే పేరు రావాలన్నారు. పేదలకోసం చేస్తున్న ఈకార్యక్రమంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే పుణ్యం దక్కుతుందన్నారు. 

చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఇళ్లపట్టాలు, ఇళ్ల నిర్మాణం కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇళ్ల నిర్మాణం ద్వారా ఏర్పడుతున్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపైనా సీఎం సమీక్షించారు.  వైయస్సార్‌ పుట్టినరోజు సందర్భంగా జులై 8న పంపిణీచేయనున్న పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ కార్యక్రమంపైనా సీఎం సమీక్షలో చర్చించారు. భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని సూచించారు. వారి కేటాయించిన స్థలంవద్దే అక్కాచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Review Meeting: అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక| Asianet News Telugu
చిన్నప్పుడు రాయల్ బైక్ ఎక్కేవాణ్ణి.. చంద్రబాబు పంచ్ లు | Chandrababu Review Meeting | Asianet Telugu