విద్యాశాఖలో పోస్టుల భర్తీకి అనుమతి.. నియోజకవర్గానికొక నైపుణ్యాభివృద్ధి కేంద్రం : జగన్

By Siva KodatiFirst Published Jan 19, 2023, 8:43 PM IST
Highlights

ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా వున్న పోస్టుల భర్తీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తిరుపతి, విశాఖలలోని స్టాఫ్ కాలేజీలను బలోపేతం చేయాలని.. అకడమిక్ స్టాఫ్ కాలేజీ ఏర్పాటు చేయాలని జగన్ సూచించారు. 

ఉన్నత విద్యాశాఖలో సంస్కరణలు చేపడుతున్నట్లు తెలిపారు ఏపీ సీఎం వైఎస్ జగన్. గురువారం ఆయన ఉన్నత విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. డిగ్రీ విద్యార్ధుల నైపుణ్యాలను బాగా పెంచాలని, వివిధ కోర్సులను పాఠ్య ప్రణాళికలో చేర్చాలని ఆదేశించారు. కోడింగ్, క్లౌడ్ సర్వీసెస్ వంటి డిమాండ్ వున్న కోర్సులపై దృష్టి పెట్టాలని.. విదేశాల్లో కోర్సులు పరిశీలించి విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకురావాలని జగన్ కోరారు. ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా వున్న పోస్టుల భర్తీపై దృష్టి పెట్టాలని.. జూన్ నాటికి భర్తీ ప్రక్రియ చేపట్టాలని జగన్ ఆదేశించారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే బీఈడీ కళాశాల్లో బోధన సిబ్బంది, వసతి సౌకర్యాలపైనా జగన్ సమీక్షించారు. తిరుపతి, విశాఖలలోని స్టాఫ్ కాలేజీలను బలోపేతం చేయాలని.. అకడమిక్ స్టాఫ్ కాలేజీ ఏర్పాటు చేయాలని జగన్ సూచించారు. 

Also REad: చిరువ్యాపారుల పెట్టుబడికి భరోసా కల్పిస్తున్నాం: జగనన్న తోడు నిధులను విడుదల చేసిన సీఎం జగన్

ఇకపోతే.. చిరు వ్యాపారులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న వారికి అండగా నిలిచేందుకు వైసిపి ప్రభుత్వం జగనన్న తోడు పథకాన్ని అమలుచేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ పథకానికి సంబంధించిన నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల విడుదల చేసారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ. పదివేల చొప్పున మొత్తం రూ.395 కోట్ల రుణాలు అందించనున్నామని... ఈ నిధులను ఒక్క బటన్ నొక్కి విడుదల చేసినట్లు తెలిపారు. గతంలో రుణాలు పొంది సకాలంలో తిరిగి చెల్లించిన 3 లక్షల 67 వేల మందితో పాటు మరో 28 వేలమందికి కొత్తగా ఈ పథకం కింద వడ్డీలేని రుణాలు అందించనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. 
 

click me!