సీఎం జగన్ నివాసం రెడ్ జోన్ లో లేదు: గుంటూరు కలెక్టర్ స్పష్టీకరణ

Published : Apr 18, 2020, 03:33 PM IST
సీఎం జగన్ నివాసం రెడ్ జోన్ లో లేదు: గుంటూరు కలెక్టర్ స్పష్టీకరణ

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం రెడ్ జోన్ లో లేదని గుంటూరు కలెక్టర్ స్పష్టం చేశారు. తాడేపల్లిని రెడ్ జోన్ గా ప్రకటించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ నివాసం రెడ్ జోన్ లో ఉందనే పుకార్లను గుంటూరు జిల్లా కలెక్టర్ ఖండించారు. జగన్ నివాసం ఉన్న తాడేపల్లి రెడ్ జోన్ లో లేదని ఆయన స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలు చేయవద్దని ఆయన సూచించారు. నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను మాత్రమే రెడ్ జోన్లుగా ప్రకటించామని, తాడేపల్లిలో ఒక్క కేసు మాత్రమే నమోదైందని ఆయన చెప్పారు. 

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరోనా వైరస్ నుంచి ఊరట లభించడం లేదు.  గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 31 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 603కు చేరుకుంది. తాజాగా కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ విజృంభించింది. కృష్ణా జిల్లాలో గత 24 గంటల్లో కొత్తగా 18 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో కొత్తగా కర్నూలు జిల్లాలో ఐదు, నెల్లూరు జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కేసు, తూర్పు గోదావరి జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. ఏపీలో మృతుల సంఖ్య 15కు చేరుకుంది. కరోనా వైరస్ వ్యాధికి చికిత్స పొంది ఇప్పటి వరకు 42 మంది డిశ్చార్జీ అయ్యారు. మరో 546 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

కరోనా వైరస్ కేసుల నమోదులో గంటూరు జిల్లాను కర్నూలు జిల్లా దాటేసింది. కర్నూలు జిల్లాలో 129 కేసులు నమోదు కాగా 126 కేసులతో గుంటూరు జిల్లా రెండో స్థానంలో ఉంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సున్నా కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో మాత్రం కేసుల సంఖ్య గత కొద్ది రోజులుగా 20గానే కొనసాగుతోంది.

కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు ఐదుగురు మరణించారు. అనంతపురం జిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ఇద్దరు మరణించారు.నెల్లూరులోనూ ఇద్దరు మరణించారు. గుంటూరు జిల్లాలో నలుగురు మరణించారు.

జిల్లాలవారీగా కరోనా వైరస్ కేసుల సంఖ్య ఇలా ఉంది. 

అనంతపురం 26
చిత్తూరు 30
తూర్పు గోదావరి 19
గుంటూరు 126
కడప 37
కృష్ణా 70
కర్నూలు 129
నెల్లూరు 67
ప్రకాశం 44
విశాఖపట్నం 20
పశ్చిమ గోదావరి 35

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan with “Tiger of Martial Arts” Title: టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు| Asianet Telugu
Raghurama krishnam raju: ఘట్టమనేని ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే RRR స్పీచ్| Asianet News Telugu