వైఎస్ఆర్ భీమా పథకం నిధులు విడుదల చేసిన సీఎం జగన్

By narsimha lode  |  First Published Mar 31, 2021, 12:17 PM IST

వైఎస్ఆర్ భీమా పథకంలో లబ్దిదారులకు రెండో విడత  నిధులను ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం నాడు అందించారు. లబ్దిదారులకు నేరుగా వారి ఖాతాల్లో డబ్బులను సీఎం జగన్ జమ చేశారు.


అమరావతి: వైఎస్ఆర్ భీమా పథకంలో లబ్దిదారులకు రెండో విడత  నిధులను ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం నాడు అందించారు. లబ్దిదారులకు నేరుగా వారి ఖాతాల్లో డబ్బులను సీఎం జగన్ జమ చేశారు.

బుధవారం నాడు క్యాంప్ కార్యాలయం నుండి ఆయన ఈ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించారు.ఇవాళ లబ్దిదారుల ఖాతాల్లోకి రూ.254 కోట్లను అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఈ పథకం కింద కుటుంబ పెద్ద సహజంగా మరణిస్తే రూ. 2 లక్షలు ఆర్దిక సహాయంగా అందించనున్నారు.

Latest Videos

ఇంటి యజమానిని కోల్పోయిన 12, 039 కుటుంబాలకు వైఎస్ఆర్ భీమా పథకం ద్వారా నిధులు అందించనున్నారు.  వాలంటర్లు వ్యక్తిగతంగా బ్యాంకు ఖాతాలను తెరిపించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన చెప్పారు.ఈ పథకం కింద రూ. 510 కోట్లను ఇన్సూరెన్స్ కింద ప్రీమియం కింద చెల్లించామన్నారు.  ఈ ఏడాది కూడ రూ. 510 కోట్లు చెల్లించనున్నట్టుగా సీఎం జగన్ హామీ ఇచ్చారు.  ఈ పథకం కింద ఎవరైనా అర్హులు మిగిలిపోయి ఉంటే  రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సీఎం జగన్ సూచించారు.
 

click me!