విజయనగరం‌లో ప్రియురాలికి నిప్పు: సీఎం జగన్ ఆరా, బాధితురాలు విశాఖకి తరలింపు

By narsimha lodeFirst Published Aug 20, 2021, 3:48 PM IST
Highlights

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చైడివాడలో ప్రేమించిన యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. బాధితురాలికి మెరుగైన వైద్య చికిత్స కోసం విశాఖపట్టణం తరలించాలని ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకొన్నారు.


అమరావతి: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడవాడ గ్రామంలో యువతి రాములమ్మపై ప్రియుడు పెట్రోలుపోసి నిప్పుపెట్టిన 
ఘటనపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకొన్నారు. గురువారం నాడు రాత్రి ఈ  ఘటన చోటు చేసుకొన్న విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. బాధితురాలికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు

also read: ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి.. పెట్రోల్ పోసి పరార్...

ఫిర్యాదు అందిన వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్పించారని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని విశాఖపట్టణం తరలించాలని సీఎం జగన్  అధికారులను ఆదేశించారు.

సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు రాములమ్మను విశాఖపట్నం తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. బాధిత  కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉండాలని సీఎం సూచించారు. అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించాలని మంత్రి బొత్స సత్యనారాయణను సీఎం ఆదేశించారు.

 నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి బొత్స సహా డిప్యూటీ సీఎం పుష్ఫశ్రీవాణి, అధికారులు బాధితురాలిని పరామర్శించారు.
 

click me!