వైయస్ జగన్ మార్క్: ఏపీలో భారీగా ఐపీఎస్ ల బదిలీ

By Nagaraju penumalaFirst Published Jun 5, 2019, 8:52 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ ల బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. మంగళవారం దాదాపు 50 మంది ఐఏఎస్ లను బదిలీ చేసిన వైయస్ జగన్ బుధవారం సాయంత్రం రాష్ట్రంలో ఐపీఎస్ ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ లపై బదిలీ వేటు వేశారు వైయస్ జగన్. 
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ ల బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. మంగళవారం దాదాపు 50 మంది ఐఏఎస్ లను బదిలీ చేసిన వైయస్ జగన్ బుధవారం సాయంత్రం రాష్ట్రంలో ఐపీఎస్ ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది ఐపీఎస్ లపై బదిలీ వేటు వేశారు వైయస్ జగన్. 

కృష్ణా జిల్లా ఎస్పీకి రవీంద్రబాబును నియమించారు. విజయవాడ జాయింట్ సీపీగా నాగేంద్రకుమార్, అలాగే చిత్తూరు జిల్లా ఎస్పీగా సిహెచ్ వెంకట అప్పలనాయుడును నియమించారు. శ్రీకాకుళం ఎస్పీగా అమ్మిరెడ్డి, విజయనగరం ఎస్పీగా రాజకుమారిని నియమించిందిఏపీ ప్రభుత్వం.  

గుంటూరు ఎస్పీగా బీహెచ్ వీ రామకృష్ణ, గుంటూరు రూరల్ ఎస్పీగా విజయలక్ష్మీలను నియమించారు. అనంతపురం ఎస్పీగా  సత్యబాబు, అనంతపురం పీటీసీ ఎస్పీగా ఘట్టమనేని శ్రీనివాస్ లను నియమించారు. 

విశాఖపట్నం డీసీపీ 1గా విక్రాంత్ పాటిల్, విశాఖపట్నం డీసీపీ 2గా ఉదయ్ కుమార్, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా నవదీప్ సింగ్ గ్రావెల్ ను నియమించారు. అక్టోపస్ ఎస్పీగా విశాల్ గున్నీ, ఎస్ఐబీ ఎస్పీగా రవిప్రకాశ్ లను నియమించారు. 

ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి ఐపీఎస్ ల బదిలీలపై కసరత్తు చేస్తున్నారు. బుధవారం ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తో రెండు సార్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఐపీఎస్ ల బదిలీలకు సంబంధించి చర్చలు జరిపారు. అనంతరం వైయస్ జగన్ ఐపీఎస్ ల బదిలీలకు పచ్చ జెండా ఊపారు. 

ఇకపోతే బదిలీ అయిన 23 మంది ఐపీఎస్ ల వివరాలు


1. విజయవాడ జాయింట్ సీపీ నాగేంద్ర కుమార్

2. పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా నవదీప్ సింగ్ గ్రావెల్ 
3. విజయనగరం  ఎస్పీగా బి.రాజకుమారి 
4.తూర్పుగోదావరి  ఎస్పీగా నయి హష్మీ 
5. గుంటూరు ఎస్పీగా  బీహెచ్వీ రామకృష్ణ
6. గుంటూరు రూరల్ ఎస్పీగా జయలక్ష్మి

7. శ్రీకాకుళం ఎస్పీగా అమ్మిరెడ్డి 
8. చిత్తూరు ఎస్పీగా సీహెచ్ వెంకట అప్పల నాయుడు
9. విశాఖ డీసీపీ 1గా విక్రాంత్ పాటిల్
10. విశాఖ డీసీపీ 2గా ఉదయ్ భాస్కర్ బిళ్ల 
11. అనంతపురం ఎస్పీగా సత్యఏసుబాబు 

12. రైల్వే ఎస్పీగా  కోయ ప్రవీణ్

13. ఆక్టోపస్ ఎస్పీగా విశాల్ గున్నీ 
14. ఇంటెలిజెన్స్ ఎస్పీగా  అశోక్ కుమార్

15. ఎస్ఐబీ ఎస్పీగా రవిప్రకాశ్ 
16. గ్రేహౌండ్స్ ఎస్పీగా రాహుల్ దేవ్ శర్మ
17. ఏలూరు రేంజ్ డీఐజీగా ఏఎస్ ఖాన్
18. సీఐడీ డీఐజీగా త్రివిక్రమ్ వర్మ

19 .సీఐడీ ఎస్పీగా సర్వ శ్రేష్ఠ త్రిపాఠి 

20. కర్నూల్ రేంజ్ డీఐజీగా వెంకటరామిరెడ్డి
 
21 అనంతపురం పిటిసి ఎస్పీగా ఘట్టమనేని శ్రీనివాస్  

ఇకపోతే గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబుని హెడ్ క్వార్టర్ కి అటాచ్ చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. రాజశేఖర్ తోపాటు ఏఆర్ దామోదర్ ను కూడా హెడ్ క్వార్టర్ కి అటాచ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 

click me!