ఆ అవార్డులకు వైఎస్ పేరు వద్దు: నా పర్మిషన్ అక్కర్లేదా.. అధికారులపై జగన్ ఆగ్రహం

By sivanagaprasad KodatiFirst Published Nov 5, 2019, 4:12 PM IST
Highlights

ప్రతిభా పురస్కారాలకు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్ధుల్ కలాం పేరు మార్పుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. తన దృష్టికి తీసుకురాకుండా పేరు మార్చడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రతిభా పురస్కారాలకు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్ధుల్ కలాం పేరు మార్పుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. తన దృష్టికి తీసుకురాకుండా పేరు మార్చడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

వివరాల్లోకి వెళితే.. నవంబర్ 11న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇచ్చే డాక్టర్ ఏపీజే అబ్ధుల్ కలాం ప్రతిభా పురస్కార అవార్డులను పేరును వైఎస్సార్ విద్యా పురస్కార అవార్డులుగా మార్చుతూ ఇటీవల అధికారులు జీవో విడుదల చేశారు.

దీనిపై రాష్ట్రంలో పెద్దదుమారమే రేగింది. మౌలానా జయంతి సందర్భంగా ఇచ్చే అవార్డులకు రాజశేఖర రెడ్డి పేరు పెట్టడంపై పలువురు విమర్శించారు. ఈ విషయం ముఖ్యమంత్రి జగన్ దృష్టికి రావడంతో అవార్డులకు యథాతథంగా అబ్ధుల్ కలాం పేరు పెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే మరికొన్ని అవార్డులకు గాంధీ, అంబేద్కర్, జ్యోతిభాపూలే, జగ్జీవన్ రామ్ పేర్లు పెట్టాలని సూచించారు. 

Also Read:జగన్ సీరియస్: సిఎస్ ఎల్వీ బదిలీ వెనక అసలు ట్విస్ట్

ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యాన్ని బదిలీ చేస్తూ సోమవారం నాడు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యాన్ని బాపట్ల హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌గా నియమించింది.

ఏపీ సీసీఎల్ఏ సెక్రటరీ గా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్‌ను ఇంచార్జీ సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.జీఎడీ ప్రిన్సిపల్ సెక్రటీ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ ఇటీవల కాలంలో బిజినెస్ రూల్స్ మార్చడంతో పాటు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సీరియస్ అయ్యారు. ఈ మేరకు ప్రవీణ్ ప్రకాష్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

సీఎం ఆదేశాల మేరకే  ప్రవీణ్ ప్రకాష్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టుగా  సమాచారం. అయితే తనకు తెలియకుండానే బిజినెస్ రూల్స్ మార్చడంతో పాటు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజినెస్ రూల్స్ తో పాటు కండక్ట్ రూల్స్‌ను అతిక్రమించాడని ఆరోపిస్తూ  ప్రవీణ్ ప్రకాష్ కు షోకాజ్ నోటీసులను జారీ చేశాడు. 

ఈ వ్యవహరం ఏపీ సీఎం వైఎస్ జగన్ కు , సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం మధ్య అగాధం పెరిగిందనే ప్రచారం సాగుతోంది.ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం  జీఎడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్‌కు నోటీసులు జారీ చేసినట్టుగా చెబుతున్నారు.

Also Read:షోకాజ్ నోటీసుల ఎఫెక్ట్: ఎల్వీ బదిలీ, కొత్త సీఎస్ రేసులో వీరే..

సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ కు సోకాజ్ నోటీసులు జారీ చేయడంపై సీఎం సీఎం వైఎస్ జగన్  అసంతృప్తి వ్యక్తం చేస్తూ  సీఎస్ బదిలీ చేసినట్టుగా సమాచారం. బాపట్ల హెచ్ఆర్‌డీ డైరెక్టరర్ జనరల్‌గా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంచార్జీ సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్‌ను నియమించారు. మరో వైపు ఏపీ సీఎస్ గా నీలం సహాని, సమీర్ శర్మల పేర్లను  ప్రభుత్వం ఏపీ సీఎస్‌గా నియమించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.

click me!