రివర్స్ టెండరింగ్‌లో జగన్ మరో సంచలనం నిర్ణయం

By Siva KodatiFirst Published Oct 9, 2019, 8:14 PM IST
Highlights

పాలనలో పారదర్శకత కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రివర్స్ టెండరింగ్‌లో మరింత లబ్ధి కలిగేలా ఆయన ఆదేశాలు జారీ చేశారు

పాలనలో పారదర్శకత కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రివర్స్ టెండరింగ్‌లో మరింత లబ్ధి కలిగేలా ఆయన ఆదేశాలు జారీ చేశారు.

బిడ్డింగ్‌లో పాల్గొన్న మొదటి 60 శాతం మందికే రివర్స్ టెండరింగ్‌లో ఛాన్స్ ఇవ్వాలని ఆయన అధికారులకు సూచించారు. రూ.10 లక్షల నుంచి రూ.100 కోట్ల విలువైన టెండర్లకు రివర్స్ టెండరింగ్ జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు

జనవరి 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. జ్యూడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్‌ల మధ్య సమన్వయం కోసం ఐఏఎస్ అధికారిని నియమించాలని ఆయన అధికారులకు సూచించారు.

శాశ్వతంగా ఉండేలా పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి తెలిపారు. మరింత పారదర్శకతతో పాటు పోటీని పెంచడానికి ఎక్కువ ప్రజాధనం ఆదా చేయడానికే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 

click me!