టీడీపీ నేత గౌతు శిరీషకు సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఐటీ చట్టం కింద నమోదు చేసిన కేసులో ఈ నెల 20న తమ ముందు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.
అమరావతి: TDP నేత గౌతు శిరీషకు సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఐటీ చట్టం కింద నమోదు చేసిన కేసులో ఈ నెల 20వ తేదీన ఉదయం 10 గంటలకు గుంటూరు CID ప్రాంతీయ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఇప్పటికే ఒకేసారి గౌతు శిరీష ఈ నెల 6వ తేదీన విచారణకు హాజరైంది.
తాజాగా సోషల్ మీడియాలోనూ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ప్రచారం చేసినా YS Jagan సర్కార్ వదిలిపెట్టడం లేదు. ఇటీవల ఆర్థిక కారణాలతో ప్రభుత్వ పథకాలైన అమ్మఒడి, వాహనమిత్ర రద్దైంది, 2022 సంవత్సరానికి గాను ఈ పథకాల లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయం అందదంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చక్కర్లు కొట్టింది. అయితే ప్రభుత్వ చిహ్నంతో ఇలా తప్పుడు పోస్టులను సోషల్ మీడియాలో పెట్టారంటూ టిడిపి నాయకురాలు గౌతు శిరీష కు ఈ నెల 4వ తేదీన సిఐడి నోటీసులు అందించింది.
undefined
జూన్ 6న ఉదయం 10గంటలకు మంగళగిరిలోకి సీఐడి ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సిందిగా CRPC సెక్షన్ 41ఏ కింద శిరీషకు నోటిసులు అందించారు.
ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ వాహనమిత్ర, అమ్మఒడి రద్దు చేశారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పై మే 30న సీఐడి కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఇప్పటికే అచ్చెన్నాయుడు ముఖ్య అనుచరుడిని సీఐడి అధికారులు ఇటీవల అదుపులోకి తీసుకుని విచారించారు.
టెక్కలి నియోజకవర్గ టిడిపి కోఆర్డినేటర్ గా అప్పిని వెంకటేశ్ ను సీఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వైసిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న అమ్మ ఒడి , వాహనమిత్ర పథకాలను ఈ ఏడాది రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చక్కర్లు కొడుతోంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న జగన్ సర్కార్ ఈ రెండు సంక్షేమ పథకాలను నిలిపివేస్తున్నట్లు ఈ పోస్ట్ సారాంశం.
ఈ క్రమంలోనే టెక్కలి టిడిపి నాయకుడు వెంకటేశ్ ఈ పోస్ట్ ను షేర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వెంకటేశ్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు విచారించారు. . ఈ క్రమంలోనే గౌతు శిరీష ఈ పోస్ట్ ను సోషల్ మీడియాలో పెట్టినట్లు గుర్తించి ఆమెను విచారణకు హాజరుకాావాలంటూ నోటీసులిచ్చారు.