అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ సీఐడీ అధికారులు ఏసీబీ అధికారులు మెమో దాఖలు చేశారు. మరో నలుగురి పేర్లను సీఐడీ అధికారుల పేర్లను ఈ కేసులో చేర్చారు.
అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ సీఐడీ అధికారులు ఏసీబీ అధికారులు మెమో దాఖలు చేశారు. మరో నలుగురి పేర్లను సీఐడీ అధికారులు ఈ కేసులో చేర్చారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ సీఐడీ అధికారులు సోమవారం నాడు కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ కేసులో మరో నలుగురి పేర్లను చేర్చారు. మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి,ఆవుల మణిశంకర్, సాంబశివరావు,ప్రమీల పేరును చేర్చింది. అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో తమకు చెందిన వారికి లబ్ది చెందేలా మార్పులు చేశారని చంద్రబాబు,నారాయణలపై ఏపీ సీఐడీ అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరో నలుగురి పేర్లను సీఐడీ చేర్చింది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది.
అమరావతి అసైన్డ్ భూముల కేసులో కూడ మాజీ మంత్రి నారాయణపై ఏపీ సీఐడీ అభియోగాలు మోపింది.ఈ కేసుకు సంబంధించి నారాయణ సహా పలువురికి ముందస్తు బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసిన విషయం తెలిసిందే.