ఉద్యోగాల భర్తీ, ఇసుక కొరతపై చర్చ: నేడే ఏపీ కేబినెట్ భేటీ

By narsimha lodeFirst Published Oct 16, 2019, 7:47 AM IST
Highlights

ఏపీ రాష్ట్ర కేబినెట్ సమావేశం బుధవారం నాడు జరగనుంది.ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. కొత్త పథకాలపై చర్చించనున్నారు. 


అమరావతి: ఇసుక రవాణా కోసం 6 వేల వాహనాలను సబ్సిడీపై ఆయా కార్పోరేషన్ ల ద్వారా పంపిణీ చేసే అంశంతో పాటు పలు అంశాలపై ఏపీ కేబినెట్ చర్చించనుంది. ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ బేటీ బుధవారం నాడు జరగనుంది.

రాష్ట్రంలో తీసుకోవాల్సిన సంక్షేమ పథకాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మగ్గం ఉన్న చేనేత కార్మికుల కుటుంబానికి ఏటా 24 వేల ఆర్థిక సాయం అందించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకొన్నారు. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలపై చర్చించనున్నారు. ప్రతి ఏటా ఈ పథకం కింద డిసెంబర్ 21న ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు.


సంక్షేమ కార్పొరేషన్ ల ద్వారా వివిధ వర్గాలకు వాహనాల పంపిణీ చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకొంది. ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుండి ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ద్వారానే ఉద్యోగాలను భర్తీ చేయనుంది.పప్పు,వరి,చిరు ధాన్యాల బోర్డుల ఏర్పాటుపై కేబినెట్ లో చర్చించనున్నారు. 

వచ్చే ఏడాది జనవరి నుండి ప్రభుత్వం రిక్రూట్ చేయనున్న ఉద్యోగాలపై కూడ కేబినెట్ లో చర్చిస్తారు. అమ్మఒడి పథకంపై కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయం తీసుకొంటారు. ప్రభుత్వంలోని ఆయా శాఖల్లో ఎన్ని ఖాళీలున్నాయి, ఏయే శాఖల్లో వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలనే విషయమై కూడ కేబినెట్ లో చర్చించి ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక నిర్ణయాన్ని వెలువర్చే అవకాశం ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ కమిషన్ లకు సభ్యుల నియామకానికి ఆమోదం తెలపనుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.46వేల675 కోట్లతో వాటర్ గ్రిడ్ ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.ఈ వాటర్ గ్రిడ్ కు కూడ కేబినెట్ ఆమోదం తెలపనుంది. 

రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అంతేకాదు ఇసుక కొరత నివారణతో పాటు ప్రత్యామ్యాయాలపై కూడ చర్చించనున్నారు. రోబో శాండ్ తయారీపై కూడ చర్చించనుంది కేబినెట్. రాష్ట్రంలో చోటు చేసుకొన్న తాజా రాజకీయ పరిణామాలపై కూడ చర్చిస్తారు.

ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలను అమలు చేసేందుకు జగన్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. మేనిఫెస్టోలో లేని అంశాలపై కూడ జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మేనిఫెస్టోలో అంశాలను అమలు చేసే క్రమంలో లోటుపాాట్లు చోటు చేసుకొంటున్నాయా అనే అంశంపై కూడ చర్చించనున్నారు. భవిష్యత్తులో కొత్త పథకాలు  ఏ రకమైన పథకాలు తీసుకురావొచ్చనే విషయమై కూడ చర్చించనున్నారు.

తమ పార్టీకి ఓటు వేయని వారు కూడ సంక్షేమ పథకాల అమల్లో తమ ప్రభుత్వ తీరును ప్రశంసించేలా పనితీరు ఉండాలని జగన్ అధికారులు, మంత్రులకు సూచిస్తున్నారు. ఈ తరహలోనే సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పథకాలు అన్నివర్గాలకు అందుతున్నాయా లేదా అనే విషయమై. కూడ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది.

click me!