బుగ్గన బడ్జెట్‌: రైతాంగానికి పెద్దపీట

By narsimha lodeFirst Published Jul 12, 2019, 1:21 PM IST
Highlights

ఏపీ  ప్రభుత్వం వ్యవసాయానికి అనుబంధ రంగాలకు బడ్జెట్‌లో రూ. 20,677 కోట్లను  కేటాయించింది. రైతాంగ సంక్షేమం కోసం తాము కట్టుబడి ఉంటామని ఎన్నికల సభల్లో వైఎస్ జగన్  ప్రకటించారు.  ఈ మేరకు బడ్జెట్‌లో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారు.

అమరావతి: ఏపీ  ప్రభుత్వం వ్యవసాయానికి అనుబంధ రంగాలకు బడ్జెట్‌లో రూ. 20,677 కోట్లను  కేటాయించింది. రైతాంగ సంక్షేమం కోసం తాము కట్టుబడి ఉంటామని ఎన్నికల సభల్లో వైఎస్ జగన్  ప్రకటించారు.  ఈ మేరకు బడ్జెట్‌లో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారు.

శుక్రవారం నాడు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.సేద్యం చేసే రైతులకు పెట్టుబడి పెట్టేందుకు వీలుగా  రూ.6750 కోట్లను  బడ్జెట్‌లో కేటాయించారు. ప్రతి ఏటా ఎకరాకు రూ. 12500ను ఇవ్వనున్నారు.వైఎస్ఆర్ ఫసల్ భీమా యోజన స్కీమ్ కింద రూ.1163 కోట్లను కేటాయించారు.

విత్తనాల సరఫరా కోసం రూ. 200 కోట్లు, రైతులకు ఉచితంగా బోర్లు వేసేందుకు రిగ్గుల కోసం రూ.200 కోట్లను కేటాయించారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయనున్నట్టు  ప్రభుత్వం ప్రకటించింది. విపత్తు నిర్వహణ నిధి కోసం రూ.2002 కోట్ల నిధిని ఏర్పాటు చేశారు. ఆక్వా రైతుల విద్యుత్ సరఫరా కోసం రూ. 475 కోట్లను కేటాయించారు.

రైతు పెట్టుబడి కోసం కౌలు రైతులకు కూడ వైఎస్ఆర్ భరోసా పథకాన్ని అమలు చేయనున్నారు. కౌలు రైతులకు ప్రభుత్వం నుండి  అన్ని రకాల సంక్షేమ పథకాలు అందేందుకు చర్యలు తీసుకొనేందుకు చట్ట సవరణ చేయనున్నట్టుగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.

సంబంధిత వార్తలు

ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తాం: బుగ్గన

click me!