ఏపీ బడ్జెట్.. నిరుద్యోగ భృతి పెంపు

By ramya NFirst Published Feb 5, 2019, 12:34 PM IST
Highlights

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు మరోసారి వరాల జల్లు కురిపించింది. నిరుద్యోగ భృతి పెంచుతున్నట్లు ప్రకటించింది.

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు మరోసారి వరాల జల్లు కురిపించింది. నిరుద్యోగ భృతి పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం రూ.వెయ్యిగా ఉన్నదానిని రూ.2వేలుగా చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.

మంగళవారం ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో నిరుద్యోగులకు వరాల జల్లు కురిపిస్తున్నట్లు యనమల తన బడ్జెట్ ప్రసంగంలో వినిపించారు. ఇక నుంచి నిరుద్యోగులకు ప్రతి నెలా.. రూ.2వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

గత ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఎన్నికల ప్రచార సమయంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ చేసిన హామీ ప్రధాన కారణమని చెప్పొచ్చు. మళ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఇదే నిరుద్యోగ భృతిని అస్త్రంగా వాడుతున్నట్లు తెలుస్తోంది

click me!