ఏపీలో ఫ్యాన్ స్విచ్ వేసే పరిస్ధితి లేదు.. 2024లో జనమే జగన్‌కి షాకిస్తారు: బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి

Siva Kodati |  
Published : Mar 31, 2022, 06:24 PM IST
ఏపీలో ఫ్యాన్ స్విచ్ వేసే పరిస్ధితి లేదు.. 2024లో జనమే జగన్‌కి షాకిస్తారు: బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాన్ స్విచ్ వేసే పరిస్థితిలో సామాన్య ప్రజలు లేరంటూ ఏపీ బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ ఛార్జీల పెంపుపై (electricity charges in ap) ఏపీ బీజేపీ (bjp)  అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి (bhanu prakash reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో జగన్మోహన్ రెడ్డికి (ys jagan) ప్రజలే పెద్ద షాక్ ఇస్తారని ఆయన జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఫ్యాన్ స్విచ్ వేసే పరిస్థితిలో సామాన్య ప్రజలు లేరంటూ సెటైర్లు వేశారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు మీద కోపంతో రాష్ట్రాన్ని సీఎం జగన్ సర్వనాశనం చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. 

ఏపీని అవినీతి ప్రదేశ్, అంధకారప్రదేశ్‌గా మారుస్తున్న గొప్ప వ్యక్తి జగన్ అంటూ భాను ప్రకాశ్ రెడ్డి కామెంట్ చేశారు. ఒకే ఒక్క ఛాన్సు అంటూ ప్రజల నడ్డి విరుస్తున్నారని .. ఇప్పటికైనా తాడేపల్లి ప్యాలెస్ వదిలి జగన్ బయటకు రావాలని కోరారు. వారం రోజుల పాటు సీఎం జగన్ బయటకు వచ్చి ప్రజలతో కలిసి గుడిసెల మధ్య నివసించాలని భాను ప్రకాష్ రెడ్డి సవాల్ చేశారు. సామాన్యుల మధ్య జీవిస్తే ప్రజల కష్టాలేంటో జగన్‌కు తెలుస్తాయన్నారు. 

కాగా.. Andhra Pradesh లో power charges పెంచిన సంగతి తెలిసిందే. 30 యూనిట్ల వరకు యూనిట్‌కు 45 పైసలను పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. 31-75 యూనిట్ల వరకు యూనిట్  కు 91 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 76-125 యూనిట్ల వరకు యూనిట్ కు రూ.1.40 పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 126-225 యూనిట్ కు రూ. 1.57 పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. 

226 నుండి 400 యూనిట్లకు యూనిట్ కు రూ. 1.16 పెంచారు.  400 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించే వారిపై  రూ.55 పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. కేటగిరిలను రద్దు చేసి ఆరు స్లాబ్ లను తీసుకొచ్చినట్టుగా ఏపీ ఈఆర్‌సీ చైర్మెన్ ప్రకటించారు. 2016-17 లో యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి రూ. 5.33 ఖర్చు అయిందని 2020-21 నాటికి యూనిట్ విద్యుత్ ఖర్చు రూ. 6.87కి పెరిగిందని ఈఆర్‌సీకి ఏపీ విద్యుత్ శాఖకు చెందిన డిస్కం కంపెనీలు వివరించాయి.  

పెరిగిన విద్యుత్ ఖర్చుల మేరకు చార్జీల పెంపును అంగీకరించాలని డిస్కంలు ఈఆర్‌సీని కోరాయి. దీంతో డిస్కంలకు విద్యుత్ చార్జీలను పెంచుకొనేందుకు అనుమతి ఇచ్చినట్టుగా ఈఆర్‌సీ చైర్మెన్ నాగార్జున రెడ్డి వివరించారు. ఇప్పటికే తెలంగాణలో కూడా  విద్యుత్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. యూనిట్ కు 50 పైసల నుండి రూ. 2 ల వరకు చార్జీలను పెంచారు. విద్యుత్ ఛార్జీల పెంపును విపక్షాలు తీవ్రంగా తప్పు బడుతున్నాయి. 125 నుండి 225 యూనిట్ విద్యుత్ ను వినియోగించే వినియోగదారులు ఎక్కువగా రాష్ట్రంలో ఉంటారు. 

వీరిపై భారం మోపారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. విద్యుత్ చార్జీల పెంపుతో  రూ. 4,400 కోట్ల భారం వినియోగదారులపై పడనుంది.  కోటి 70 లక్ష మందిపై విద్యత్ చార్జీల భారాన్ని డిస్కంలు మోపాయి..వివిధ కేటగిరిల కింద రూ. 1400 కోట్ల భారం పడనుంది. 75 యూనిట్ల లోపు వాడే వినియోగదారులు రాష్ట్రంలో సుమారు 65 లక్షల మంది ఉంటారు.మూడేళ్లలో ట్రూప్ అప్ చార్జీల పేరుతో రూ. 3 వేల కోట్ల వసూలుకు ఈఆర్సీ అనుమతిని ఇచ్చింది.2014 నుండి 2019 వరకు సర్ధుబాటు చార్జీల పేరుతో వసూళ్లు చేశాయి డిస్కం సంస్థలు ఈ ఏడాది ఏప్రిల్ నుండి కొత్త టారీఫ్ రేట్లు అమల్లోకి రానున్నాయి.  ఈ ఏడాది ఆగష్టు నుండి ట్రూఆప్ చార్జీలను వసూలు చేయనున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Jana Sena 13th Formation Day: వినూత్నంగా జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు| Asianet News Telugu
AP Food Commission Chairman: ఉప్మాలో పురుగులు ఫిర్యాదు చేసిన పేరెంట్స్| Asianet News Telugu