రాజన్న కూడు పెడితే జగనన్న పొట్ట కొడుతున్నాడు: బీజేపీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు

Published : Aug 09, 2019, 03:01 PM IST
రాజన్న కూడు పెడితే జగనన్న పొట్ట కొడుతున్నాడు: బీజేపీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు

సారాంశం

విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ దివంగత సీఎం రాజన్న కూడు పెడితే ప్రస్తుత సీఎం జగనన్న పొట్ట కొడుతున్నారంటూ విమర్శించారు. లక్షలాది ఉద్యోగాలంటూ నానా హంగామా చేసిన వైసీపీ, గ్రామ వాలంటీర్ పోస్టులను కేవలం వైసీపీ కార్యకర్తలకే ఇస్తున్నారంటూ ఆరోపించారు. ఇసుక విధానంపై ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తోందని ఆరోపించారు. 

విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ దివంగత సీఎం రాజన్న కూడు పెడితే ప్రస్తుత సీఎం జగనన్న పొట్ట కొడుతున్నారంటూ విమర్శించారు.  

లక్షలాది ఉద్యోగాలంటూ నానా హంగామా చేసిన వైసీపీ, గ్రామ వాలంటీర్ పోస్టులను కేవలం వైసీపీ కార్యకర్తలకే ఇస్తున్నారంటూ ఆరోపించారు. ఇసుక విధానంపై ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తోందని ఆరోపించారు. 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. పోలవరం రీటెండరింగ్ విధానాన్ని తప్పుబట్టారు. టెండర్లు రద్దు చేసుకుంటూ పోతే నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండబోదన్నారు. అవినీతి నిర్మూలనపై జగన్ మాటలు తప్ప చేతలు లేవని బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.

PREV
click me!

Recommended Stories

Chandrababu Great Speech About Janasena | Pawan Kalyan | Asianet Telugu
ఏపీలో 3డీ కాంక్రీట్ ఇళ్లు.. అస‌లేంటీ టెక్నాల‌జీ, 10 రోజుల్లో ఇంటిని ఎలా క‌ట్టేస్తారు.?