అసెంబ్లీలో చర్చలపై ఎమ్మెల్యేలకు సీతారాం క్లాస్

By narsimha lodeFirst Published Jul 3, 2019, 11:58 AM IST
Highlights

శాసనసభలో చర్చలు అర్థవంతంగా  జరిగితేనే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని ఏపీ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. శాసనసభలో  ప్రజా ప్రతినిధుల ప్రవర్తనను ప్రజలు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకొంటారని ఆయన అభిప్రాయపడ్డారు.


అమరావతి: శాసనసభలో చర్చలు అర్థవంతంగా  జరిగితేనే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని ఏపీ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. శాసనసభలో  ప్రజా ప్రతినిధుల ప్రవర్తనను ప్రజలు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకొంటారని ఆయన అభిప్రాయపడ్డారు.

బుధవారం నాడు ఏపీ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు రెండు రోజుల శిక్షణను ఆయన ప్రారంభించారు. ఈ శిక్షణ తరగతులకు టీడీపీ సభ్యులు  దూరంగా ఉన్నారు. మంచి శాసనసభ్యులుగా పేరు తెచ్చుకొనేందుకు సభ ఉపయోగపడుతోందని  ఆయన చెప్పారు.

ఆ తర్వాత  ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి రూల్స్ గురించి తెలుసుకోవాలన్నారు. అంతేకాదు ఏ సబ్జెక్టు మీద మాట్లాడాలని భావిస్తున్నారో ఆ సబ్జెక్టు మీద  అవగాహనను పెంచుకోవాలని  ఆయన సభ్యులకు సూచించారు. బహిరంగ సభల్లో  గొప్ప స్పీకర్‌గా ఉన్న వ్యక్తులు కూడ అసెంబ్లీలో ఒక్కో సమయంలో ఫెయిల్ అయిన సందర్భాలు కూడ ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

అసెంబ్లీలో చర్చలో పాల్గొనే సమయంలో తాను ఉదయమే నాలుగు గంటలకే  ఆ సబ్జెక్టు మీద ప్రిపేర్ అయినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఆయా సబ్జెక్టు మీద ప్రిపేర్ అయితేనే ఇతర సభ్యులు అడ్డు తగిలినా.. ప్రశ్నించినా కూడ వాటికి సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు.

సభా సమయాన్ని  వృధా చేయకూడదని  సీఎం జగన్ సూచించారు. గత ప్రభుత్వం మాదిరిగా కూడ విపక్షానికి కూడ మాట్లాడే సమయాన్ని ఇస్తామన్నారు. ప్రతిపక్షానికి సమయం ఇచ్చి....విపక్షం లేవనెత్తే ప్రశ్నలకు సరైన సమాధానం చెబితే ప్రజలు నమ్ముతారని  ఆయన చెప్పారు.
 

click me!