ఏపీలో భారీగా తగ్గుతున్న కరోనా కేసులు: గత ఆరు నెలల్లో ఇదే తొలిసారి

Published : Nov 16, 2020, 05:22 PM ISTUpdated : Nov 16, 2020, 05:31 PM IST
ఏపీలో భారీగా తగ్గుతున్న కరోనా కేసులు: గత ఆరు నెలల్లో ఇదే తొలిసారి

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 753  కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 54వేల 764 కి చేరుకొన్నాయి. గత ఆరు నెలల కాలంలో వెయ్యిలోపు కరోనా కేసులు రావడం ఇదే ప్రథమంగా అధికారులు చెబుతున్నారు.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 753  కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 54వేల 764 కి చేరుకొన్నాయి. గత ఆరు నెలల కాలంలో వెయ్యిలోపు కరోనా కేసులు రావడం ఇదే ప్రథమంగా అధికారులు చెబుతున్నారు. ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గాయి.

గత 24 గంటల్లో 13 మంది కరోనా మరణించారు. కరోనాతో చిత్తూరు, కృష్ణా, విశాఖపట్టణం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరి చొప్పున చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 6881కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 91లక్షల 97వేల 307 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.  గత 24 గంటల్లో 43,044 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.వీరిలో 753 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో1,507 మందికి కరోనా నుండి కోలుకొన్నారు.

ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 29వేల 991 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 17,892 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 04,చిత్తూరులో 87,తూర్పుగోదావరిలో 130, గుంటూరులో 050 కడపలో 066, కృష్ణాలో 076, కర్నూల్ లో 012, నెల్లూరులో 014, ప్రకాశంలో 036, శ్రీకాకుళంలో 025, విశాఖపట్టణంలో 025, విజయనగరంలో 012,పశ్చిమగోదావరిలో 216 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -66,177, మరణాలు 581
చిత్తూరు  -82,149,మరణాలు 810
తూర్పుగోదావరి -1,20,571, మరణాలు 626
గుంటూరు  -71,046, మరణాలు 639
కడప  -53,681,మరణాలు 445
కృష్ణా  -43,273, మరణాలు 611
కర్నూల్  -59,954, మరణాలు 483
నెల్లూరు -60,898, మరణాలు 491
ప్రకాశం -60,987, మరణాలు 576
శ్రీకాకుళం -45,044, మరణాలు 345
విశాఖపట్టణం  -57,320, మరణాలు 527
విజయనగరం  -40,295,మరణాలు 233
పశ్చిమగోదావరి -90,474, మరణాలు 514

 


 

PREV
click me!

Recommended Stories

Roop Kumar Yadav Serious Comments Anil Kumar Yadav | Nellore Political Heat | Asianet News Telugu
Manyam Collector Presentation on Mustabu Programme | Chandrababu | Collectors | Asianet News Telugu