చిత్తూరులో అత్యధికం,ప.గోదావరిలో అత్యల్పం: ఏపీలో మొత్తం కరోనా కేసులు 20,92,227కి చేరిక

By narsimha lode  |  First Published Jan 13, 2022, 4:55 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి.  నిన్నటితో పోలిస్తే  వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో47,884 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 4348  మందికి కరోనా నిర్ధారణ అయింది


అమరావతి:Andhra pradesh  రాష్ట్రంలో   గత 24 గంటల్లో  భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 4348 corona కేసులు నమోదయ్యాయి.గత 24 గంటల్లో47,884 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 4348  మందికి కరోనా నిర్ధారణ అయింది.  రాష్ట్రంలో కరోనా కేసులు 20,92,227కి చేరుకొన్నాయి.కరోనాతో గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మరణించారు. ఎవరూ కూడా మరణించలేదు.  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 14,507 కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో 261 మంది Corona నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 20లక్షల 63వేల 516 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 14,204 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

Latest Videos

undefined

గత 24 గంటల్లో అనంతపురంలో230,చిత్తూరులో 932, తూర్పుగోదావరిలో247,గుంటూరులో338,కడపలో 174, కృష్ణాలో296, కర్నూల్ లో171, నెల్లూరులో395, ప్రకాశంలో 107,విశాఖపట్టణంలో 823,శ్రీకాకుళంలో259, విజయనగరంలో 290,పశ్చిమగోదావరిలో 086కేసులు నమోదయ్యాయి.


ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,59,214, మరణాలు 1093
చిత్తూరు-2,51,912, మరణాలు1959
తూర్పుగోదావరి-2,96,207, మరణాలు 1290
గుంటూరు -1,80,547,మరణాలు 1260
కడప -1,16,374, మరణాలు 644
కృష్ణా -1,21,725,మరణాలు 1482
కర్నూల్ - 1,24,702,మరణాలు 854
నెల్లూరు -1,48,276,మరణాలు 1060
ప్రకాశం -1,39,196, మరణాలు 1130
శ్రీకాకుళం-1,24,592, మరణాలు 794
విశాఖపట్టణం -1,61,782 మరణాలు 1143
విజయనగరం -83,983, మరణాలు 673
పశ్చిమగోదావరి-1,80,526, మరణాలు 1125

 

 

ఈ నెల 18వ తేదీ నుండి నైట్ కర్ఫ్యూను అమలు చేయాలని మంగళవారం నాడు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు  జారీ చేసింది.
ఈ నెల 31వ తేదీ వరకు రాత్రి పూట కర్ఫ్యూను అమలు చేయనున్నారు. రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.

ఫార్మసీ దుకాణాలు, మీడియా సంస్థలు, టెలి కమ్యూనికేషన్లు, ఐటీ, విద్యుత్ సేవలు, పెట్రోల్ బంకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణీకులకు నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇచ్చారు. 

నైట్ కర్ఫ్యూతో పాటు కరోనా ఆంక్షలను కూడా కఠినంగా అమలు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోతే రూ.10 నుండి రూ. 15 వేల వరకు ఫైన్ విధించనున్నారు.  షాపింగ్ మాల్స్, దుకాణాల వద్ద కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. సినిమా థియేటర్లో 50 శాతం ఆక్యుపెన్సీతో నడపాలని ఆదేశించింది. ఆర్టీసీ సహా ప్రజా రవాణా వ్యవస్థల్లో మాస్కులు తప్పనిసరి చేసింది జగన్ సర్కార్.

: 13/01/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,89,332 పాజిటివ్ కేసు లకు గాను
*20,60,621 మంది డిశ్చార్జ్ కాగా
*14,507 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 14,204 pic.twitter.com/zy1vcrt1EE

— ArogyaAndhra (@ArogyaAndhra)


 

click me!