ఏపీపై కరోనా దెబ్బ: 24 గంటల్లో 50 కేసులు, మొత్తం 1980కి చేరిక

Published : May 10, 2020, 11:08 AM ISTUpdated : May 10, 2020, 11:30 AM IST
ఏపీపై కరోనా దెబ్బ: 24 గంటల్లో 50 కేసులు, మొత్తం 1980కి చేరిక

సారాంశం

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 43 మందికి కరోనా  సోకింది. మరో 45 మంది కరోనా నుండి పూర్తిగా కోలుకొన్నారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1930 కి చేరుకొందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 50 మందికి కరోనా  సోకింది. మరో 45 మంది కరోనా నుండి పూర్తిగా కోలుకొన్నారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1980 కి చేరుకొందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

 

గత  24 గంటల్లో నమోదైన 50 కేసుల్లో చిత్తూరు జిల్లా  అత్యధికంగా 16 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో కర్నూల్ జిల్లా నిలిచింది. కర్నూల్ లో 13 విశాఖపట్టణంలో 1, అనంతపురంలో 5 , గుంటూరులో 6, నెల్లూరులో 5, ప్రకాశంలో 2, కడపలో1, కృష్ణాలో 1కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 8666 శాంపిల్స్ ను పరీక్షిస్తే 50  మందికి కరోనా సోకినట్టుగా తేలిందని ప్రభుత్వం తెలిపింది.

రాష్ట్రంలో అత్యధికంగా కర్నూల్ జిల్లాలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఈ జిల్లాలో 566 కేసులు నమోదైనట్టుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాతి స్థానంలో గుంటూరు జిల్లా నిలిచింది. గుంటూరులో 382 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో 339 కేసులు నమోదైనట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

అనంతపురంలో 107,చిత్తూరులో 112,తూర్పుగోదావరిలో 46, గుంటూరులో 382, కడపలో 97, కృష్ణాలో 339, నెల్లూరులో 101, ప్రకాశంలో 63, శ్రీకాకుళంలో 5, విశాఖపట్టణంలో 63, విజయనగరంలో 68, పశ్చిమగోదావరిలో 68 కేసులు నమోదయ్యాయి. 

రాష్ట్రంలో 1010 కేసులు యాక్టివ్ కేసులుగా ప్రభుత్వం ప్రకటించింది. కరోనా సోకి ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకొన్న వారి సంఖ్య 925కి చేరుకొంది. ఇప్పటివరకు 45 మంది మృతి చెందారని ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ తేల్చి చెప్పింది.

PREV
click me!

Recommended Stories

YS Jagan Speech: మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ఒక పెద్ద స్కామ్‌ | YSRCP | Asianet News Telugu
Smart Kitchen Project for Schools | CM Appreciates Kadapa District Collector | Asianet News Telugu