నెల్లూరులో కరోనా జోరు: ఏపీలో మొత్తం కేసులు 20,26,042 కి చేరిక

Published : Sep 09, 2021, 04:51 PM ISTUpdated : Sep 09, 2021, 04:52 PM IST
నెల్లూరులో కరోనా జోరు: ఏపీలో మొత్తం కేసులు 20,26,042 కి చేరిక

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1439 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే కరోనాతో 15 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనా కేసులు 20,26,042 కి చేరుకొన్నాయి.రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,964 కి చేరింది.

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో62,856 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 1439 మందికి కరోనా నిర్ధారణ అయింది.  రాష్ట్రంలో కరోనా కేసులు 20,26,042 కి చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 15 మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 13,964 కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో 1311మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 19 లక్షల 97వేల 454 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 14,624 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,71,61,670 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

గత 24 గంటల్లో అనంతపురంలో029,చిత్తూరులో 263, తూర్పుగోదావరిలో170,గుంటూరులో142,కడపలో 066, కృష్ణాలో131, కర్నూల్ లో008, నెల్లూరులో260, ప్రకాశంలో 087,విశాఖపట్టణంలో 079,శ్రీకాకుళంలో022, విజయనగరంలో 008,పశ్చిమగోదావరిలో 182 కేసులు నమోదయ్యాయి.


గత 24 గంటల్లో కరోనాతో  15 మంది చనిపోయారు. కృష్ణాలో నలుగురు,చిత్తూరులో ముగ్గురు, పశ్చిమగోదావరి, ప్రకాశంలో  జిల్లాల్లో ఇద్దరు చొప్పున చనిపోయారు. నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాల్లొ ఒక్కొక్కరి చొప్పున మరణించారు. .దీంతో రాష్ట్రంలో  కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,964కి చేరుకొంది.

 
ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,57,319, మరణాలు 1092
చిత్తూరు-2,40,063 మరణాలు1868
తూర్పుగోదావరి-2,87,320, మరణాలు 1266
గుంటూరు -1,73,645,మరణాలు 1188
కడప -1,13,344, మరణాలు 632
కృష్ణా -1,14,918,మరణాలు 1339
కర్నూల్ - 1,23,909,మరణాలు 850
నెల్లూరు -1,41,945,మరణాలు 1018
ప్రకాశం -1,34,680, మరణాలు 1064
శ్రీకాకుళం-1,22,328, మరణాలు 780
విశాఖపట్టణం -1,55,573, మరణాలు 1108
విజయనగరం -82,565, మరణాలు 669
పశ్చిమగోదావరి-1,75,543, మరణాలు 1090

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్