24 గంటల్లో కృష్ణాలో అత్యధికం, అనంతపురంలో అత్యల్పం: ఏపీలో 8,63,843కి చేరిన కరోనా కేసులు

Published : Nov 24, 2020, 06:18 PM IST
24 గంటల్లో కృష్ణాలో అత్యధికం, అనంతపురంలో అత్యల్పం: ఏపీలో 8,63,843కి చేరిన కరోనా కేసులు

సారాంశం

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1085 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 63వేల 843 కి చేరుకొన్నాయి. 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1085 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 63వేల 843 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో 08 మంది కరోనా మరణించారు. కరోనాతో కృష్ణాలో ఇద్దరు మరణించారు. చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, నెల్లూరు, విశాఖపట్టణం జిల్లాల్లో ఒక్కరేసి చొప్పున చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు  మరణించినవారి సంఖ్య 6,956కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 97లక్షల 27వేల 321 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.  గత 24 గంటల్లో 65,101 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.వీరిలో 1085మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో1447 మంది కరోనా నుండి కోలుకొన్నారు.

ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 43వేల 863 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 13,024  యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 010,చిత్తూరులో 142,తూర్పుగోదావరిలో 116 గుంటూరులో 126, కడపలో 057 కృష్ణాలో 224, కర్నూల్ లో 031, నెల్లూరులో 050, ప్రకాశంలో 042, శ్రీకాకుళంలో 026, విశాఖపట్టణంలో 086 విజయనగరంలో 037,పశ్చిమగోదావరిలో 138కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -66,503, మరణాలు 587
చిత్తూరు  -83,268,మరణాలు 823
తూర్పుగోదావరి -1,21,844, మరణాలు 634
గుంటూరు  -72,304, మరణాలు 646
కడప  -54,134,మరణాలు 449
కృష్ణా  -44,745, మరణాలు 626
కర్నూల్  -60,116, మరణాలు 485
నెల్లూరు -61,221, మరణాలు 495
ప్రకాశం -61,332,మరణాలు 577
శ్రీకాకుళం -45,352, మరణాలు 346
విశాఖపట్టణం  -57,813, మరణాలు 535
విజయనగరం  -40,527,మరణాలు 234
పశ్చిమగోదావరి -91,789, మరణాలు 519

 

 

PREV
click me!

Recommended Stories

Rain Alert: బంగాళ‌ఖాతంలో అల్ప‌పీడ‌నం.. ఈ ప్రాంతాల్లో అకాల వ‌ర్షాలు. ఇండియా, పాక్ మ్యాచ్‌పై ప్ర‌భావం.?
అంబటి అరెస్టు రాజకీయ కక్షసాధింపే | Baireddy Siddharth Reddy Slams Alliance | Asianet News Telugu