సలహాదారుకు జగన్ సర్కార్ షాక్: పోలవరం ప్రాజెక్టే కారణం

Published : May 16, 2020, 09:01 AM ISTUpdated : May 16, 2020, 09:11 AM IST
సలహాదారుకు జగన్ సర్కార్ షాక్: పోలవరం ప్రాజెక్టే కారణం

సారాంశం

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. హెచ్‌కే సాహును పోలవరం ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారుగా తప్పిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి జలవనరులశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్ ఉత్తర్వులను జారీ చేసారు. 

ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అనేక ట్విస్టులతో, సడన్ నిర్ణయాలతో, మధ్యలో అనూహ్య కోర్టు తీర్పులతో సాగుతుంది. తాజాగా ఈ  పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది.

హెచ్‌కే సాహును పోలవరం ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారుగా తప్పిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి జలవనరులశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్ ఉత్తర్వులను జారీ చేసారు. 

2018 ఏప్రిల్‌ 14న సాహుని కన్సల్టెంట్‌గా అప్పటి ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్‌లోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారుగా సాహు పనిచేస్తున్నారు. 

ఎందుకు తొలిగించారనేదానిపై అధికారికంగా క్లారిటీ రాకున్నప్పటికీ.... ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారుగా ఆయన  పనితీరు సంతృప్తికరంగా లేదని ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు సీఈఓ నివేదిక పంపించారని, ఈ కారణంగానే సాహూను కన్సల్టెంట్‌గా తొలిగించినట్టు తెలియవస్తుంది. 

సాహు ను తలొగించడంతో అనేక కొత్త ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారు? వేరే ఎవరినైనా నియమిస్తారు, ఆ పదవినే ఏకంగా తొలిగిస్తారా అని అనేక ప్రశ్నలు ఇప్పుడు ఓపెన్ గా ఉన్నాయి. వేచి చూడాలి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో!

ఇకపోతే... ఈ పోలవరం ప్రాజెక్టుని పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేయనున్నట్టుగా కేంద్రం గతంలో ప్రకటించింది. మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పార్లమెంట్‌లో వేసిన ప్రశ్నకు  కేంద్రం లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది.

పోలవరం ప్రాజెక్టును ఎప్పటిలోపుగా పూర్తి చేస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని సుజనా చౌదరి ప్రశ్నించారు.  కాంట్రాక్టు నిర్వహణ కారణాలతో ప్రాజెక్టు నిర్మాణాన్ని 2021లోపుగా పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించింది. 

ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటి వరకు 3047 కోట్లు ఖర్చు చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.అయితే  ఇందులో  కేంద్ర ప్రభుత్వం 1440 కోట్లను  ఇచ్చిన విషయాన్ని కేంద్రం గుర్తు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం తాము ఖర్చు చేసిన నిధులకు సంబంధించి ఆడిట్ రిపోర్టును అందిస్తేనే నిధులను విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు 2019 నవంబర్ 26వ తేదీన కేంద్రం రాష్ట్రప్రభుత్వానికి  తేల్చి చెప్పిందని  సుజనాకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu