ఏపీలో ఉద్యోగుల ఆందోళన: కొత్త పీఆర్సీతోనే జీతాల చెల్లింపునకు సర్కార్ కసరత్తు

By narsimha lode  |  First Published Jan 20, 2022, 1:05 PM IST


కొత్త పీఆర్సీ మేరకు జీతాలు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే కొత్త పీఆర్సీని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కొత్త పీఆర్సీ మేరకు వేతనాల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని ట్రెజరీలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.



అమరావతి: కొత్త Prcపై Employees నేతలు ఆందోళన చేస్తున్న సమయంలో ఏపీ సర్కార్ కూడా పీఆర్సీపై తగ్గడం లేదు.  ఈ మేరకు Andhra pradesh రాష్ట్రంలోని ట్రెజరీలకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తున్న సమయంలో  ఈ ఆదేశాలు వెలువడడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.

కొత్త పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు తమ అంగీకారం తెలపకపోతే ప్రభుత్వం పాత జీతాలనే చెల్లిస్తోందా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Latest Videos

కొత్త పీఆర్సీ ఆధారంగా  సవరించిన పే స్కేల్స్  తో Salaries చెల్లింపునకు సంబంధించి మార్పులు చేర్పులు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరో వైపున కొత్త జీతాల చెల్లింపునకు సంబంధించి ప్రత్యేక Software  ను సీఎఫ్ఎంఎస్ సిద్దం చేసింది.

పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా  ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరౌతున్నారు. మరో వైపు కొత్త పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్టేట్ల  వద్ద ఆందోళనకు దిగాయి. 

మరో వైపు ఉేద్యోగ సంఘాలు సమ్మె కు వెళ్లాలని భావిస్తున్నాయి. ఈ విషయమై  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసును కూడా ఇవ్వనున్నాయి. ఈ విషయమై ఇవాళ ఉద్యోగ సంఘాలు మరోసారి సమావేశం కానున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం Ys Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు.  అయితే ఈ నెల 17వ తేదీ రాత్రి పీఆర్సీపై  ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. 30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.తక్కువ  ఫిట్‌మెంట్ ఇచ్చినా పీఆర్సీ ఫిట్‌మెట్ కు అంగీకరించినా ప్రభుత్వం హెచ్ఆర్‌ఏ తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

click me!